యాప్నగరం

నా భార్య నన్ను ఎప్పుడూ అనుమానిస్తోంది

నా భార్య వల్ల నేను చాలా అసహనానికి గురవుతున్నా. ఆమె 24 గంటలు నన్ను అనుమానిస్తూనే ఉంటుంది.

TNN 29 Aug 2016, 4:16 am
ప్రశ్న: నా భార్య వల్ల నేను చాలా అసహనానికి గురవుతున్నా. ఆమె 24 గంటలు నన్ను అనుమానిస్తూనే ఉంటుంది. నేను ఇతర మహిళలతో ఏదైనా సంబంధం పెట్టుకున్నానేమోనని ఆమె ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. నేను ఎవరితో మాట్లాడినా డౌట్ పడుతుంది. నాతో మాట్లాడే ప్రతి మహిళను తిడుతుంది. దీంతో నేను నా భార్య సోదరీలతో మాట్లాడడం కూడా మానేశాను. మా మధ్య జరిగే సంభాషనలను ఆమె గమనిస్తూ ఉండడమే అందుకు కారణం. మాకు పెళ్లయి దాదాపు 18 ఏళ్లు అయింది. మాకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మా ఆవిడ ప్రవర్తన భరించలేక నేను రెండుసార్లు ఆమెను సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాను. మీకు ఇంకో విషయం చెప్పాలి. నా భార్య ఒక చార్టెడ్ అకౌంటెంట్. అయితే ఆమెలో అనుమానం విషయం తప్పా మిగతావన్నీ ఓకే. ఈ సమస్యకు ఏమైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పగలరు. ( ప్రశ్న అడిగిన వ్యక్తి వివరాలు లేవు)
Samayam Telugu my wife is the most suspicious woman alive
నా భార్య నన్ను ఎప్పుడూ అనుమానిస్తోంది

డాక్టర్ ఎరా దత్తా జవాబు: మీరు చెప్పిన విషయాలు బట్టీ చూస్తే మీ భార్య డెల్ సియనల్ డిజార్డర్ డిసీజ్ తో బాధపడుతోంది. ఇలాంటి వాళ్లు ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తుంటారు. ఇలాంటి వారు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తుంటారు. ప్రముఖ ఇంగ్లీష్ రైటర్ షేక్స్పియర్ తన నావెల్స్ లో ఇలాంటి పాత్రలను కూడా క్రియేట్ చేశాడు. ఆయన నవల్లలోని క్యారెక్టర్స్ (ఒథెల్లో ) పేరే ఇలాంటి వారికి వ్యాధిని తెలిపే సిండ్రోమ్ గా మారింది. అందువల్ల దీనిని ఒథెల్లో సిండ్రోమ్ అంటుంటారు. ఇలాంటి వారు ఎక్కువగా అనుమానిస్తుంటారు. వాళ్ల పార్టనర్స్ ను ఎక్కువ మానిటర్ చేస్తుంటారు. అయితే మీరు మళ్లీ మీ భార్యను సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాల్సి ఉంది. రెగ్యులర్ గా అతని సలహాలు తీసుకుని పాటించాలి.
జవాబు చెప్పిన వారు : డాక్టర్ ఎరా దత్తా ఎస్ ఎల్ రహేజా, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఫోర్టిస్ హాస్పిటల్ మహీం.
మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఎక్స్ పర్ట్ నుంచి సలహాలు కావాలంటే expertadvice.toi@gmail.com మెయిల్ పంపండి. అయితే మెయిల్ ఇంగ్లిష్ లోనే పంపాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.