యాప్నగరం

వారానికి ఒకసారి ‘అది’ చేస్తే.. ఆయుష్షు పెరుగుతుంది: స్టడీ

పడక గది సుఖాన్ని బోరింగ్‌గా భావిస్తున్నారా? అయితే, ఈ స్టడీలో తేలిన విషయాలు గురించి తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు.

Samayam Telugu 14 Dec 2020, 9:55 pm
డక గది సుఖాన్ని చాలామంది తప్పుగా భావిస్తారు. వాస్తవానికి అది శరీరానికి ఆరోగ్యాన్ని అందించే చక్కని ఔషదం. మన శరీరానికి తిండి, నిద్ర ఎలా అవసరమో. కలయిక కూడా అంతే అవసరం. సృష్టికి సైతం మూలం ‘అదే’. అయితే, పెళ్లయిన తర్వాత చాలా జంటలు.. మళ్లీ మళ్లీ కలిసేందుకు ఇష్టపడరు. దీంతో ‘కలయిక’ అనేది గగనంగా మారుతుంది. రెండు వారాలకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి చొప్పున కలుస్తుంటారు. కొంతమంది ఆ సుఖానికి కూడా నోచుకోరు. వయస్సు పెరిగే కొద్ది ‘అది’ బోరింగ్‌ అనుకుంటారు. అయితే, ఇలా పడక గది సుఖానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి హానికరమనే సంగతి మీకు తెలుసా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.
Samayam Telugu వారానికి ఒకసారి ‘అది’ చేస్తే.. ఆయుష్షు పెరుగుతుందట


తాజా అధ్యయనం ప్రకారం.. పడక గదిలో ఆలుమగల కలయిక అనేది ‘నిత్యవసరం’. దీన్ని కేవలం శరీరక సుఖంగా భావించకూడదు. దీనివల్ల మీలో ఒత్తిడి తగ్గి ఉత్సాహం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుంచి గట్టెక్కిస్తుంది.

ఆరోగ్యం విషయంలో.. డైటింగ్, వ్యాయామం అనేవి ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి లింకై ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే, అవి మాత్రమే కాకుండా పరిశోధకులు మూడో విషయాన్ని కూడా తెరపైకి తెచ్చారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ డైటింగ్, వ్యాయామం చేయడమే కాకుండా.. శరీరకంగా కూడా కలవాలని స్పష్టం చేశారు. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని పేర్కొన్నారు.

Read Also: ‘నా భర్త స్నేహితుడు.. ఆయన ముందే నాకు ముద్దు పెట్టాడు, అది చూసి...’

న్యూ ఇంగ్లాండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో.. ప్రపంచవ్యాప్తంగా గుండె సమస్యలు పెరిగినట్లు తెలిసింది. 22 ఏళ్లపాటు నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 1,120 మంది పురుషులు, మహిళల జీవనశైలిపై నిఘా ఉంచారు. రోజూ శరీరకంగా కలిసే వ్యక్తుల్లో గుండె సమస్యలు తగ్గడమే కాకుండా ఇతరాత్ర అనారోగ్య సమస్యల లక్షణాలు కూడా తగ్గిపోయాయట. అలాగే అప్పుడప్పుడు కలయికను ఎంజాయ్ చేసేవారిలో సైతం మెరుగైన ఫలితాలు కనిపించాయట.

Read Also: ‘నా ప్రియురాలికి పెళ్లయ్యింది, ఒక బిడ్డ కూడా.. లాక్‌డౌన్‌లో మళ్లీ ఆమె నాతో...’

వారంలో ఒకటి కంటే రెండు సార్లు కలయికలో పాల్గొనేవారిలో హార్ట్ ఎటాక్ ఏర్పడే ముప్పు 27 శాతం కంటే తక్కువగా నమోదైంది. అయితే, అప్పుడప్పుడు మాత్రమే కలయికను ఎంజాయ్ చేసేవారిలో మాత్రం ముప్పు 8 శాతం పెరిగినట్లు గుర్తించారు. అయితే, రోజూ ఆ ‘పని’ చేయడానికి ఇష్టపడని జంటలు.. వారానికి కనీసం ఒక్కసారి చేసినా ఈ ప్రయోజనాలను పొందవచ్చని పరిశోధకులు సూచించారు. ఇలా చేయడం వల్ల ఆయుష్సు 37 శాతానికి పెరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం.. వారానికి ఒకసారి ‘ఆరోగ్యం’ కోసం సుఖ క్రీడలో అలసిపోండి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.