యాప్నగరం

కాబోయే భార్యలో కోరుకునే లక్షణమిదే!

జీవితంలో ముఖ్యమైన ముందడుగు పెళ్లి. చాలా మందికి తమ భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటారు.

TNN 23 Feb 2017, 6:07 pm
జీవితంలో కీలకమైన ముందడుగు పెళ్లి. జీవితంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం వివాహమే. మూడు ముళ్లతో ఒక్కటై.. జీవితాంతం తోడుగా ఉండాల్సి ఉంటుంది. తమకు కాబోయే భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అమ్మానాన్నను బాగా చూసుకోవాలని అబ్బాయిలు, తమ కుటుంబంలో ఒకడిలా కలిసేపోయే వాడు దొరకాలని అమ్మాయిలు కోరుకుంటుంటారు. జీవితాన్ని వివిధ కోణాల్లో చూసిన ఐదుగురు వ్యక్తులను ఇదే విషయమై ప్రశ్నించగా.. వారు తమకు కాబోయే భార్యలో ఉండాల్సిన లక్షణం గురించి వారు ఇచ్చిన ఆసక్తికరమైన సమాధానాలే ఇవి..
Samayam Telugu real men reveal one quality they actually want in their future wife
కాబోయే భార్యలో కోరుకునే లక్షణమిదే!


1. నాకు కాబోయే భార్య ‘మగాళ్ల ఇగో’ అనే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలి. చాలా వరకు నిర్ణయాలను ఇద్దరం కలిసే తీసుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో భర్త ఆధిపత్యం ఉంటుందని తను తెలుసుకొని మసులుకోవాలి. ఇది భర్తలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు తమకు గౌరవం ఇస్తుందని ఫీలవుతారు. - దివ్యేష్ గౌతమ్, ఆటోమొబైల్ అనలిస్ట్

2. కాబోయే భార్యలో నేను కోరుకునే మొదటి క్వాలిటీ తను తెలివైనదై ఉండాలి. సమకాలీన ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయమై తనకు అవగాహన ఉండాలి. బాగా చదవగలగాలి. సొంత ఆలోచనా రీతిలోనే తను వివిధ అంశాల గురించి చర్చించాలని కోరుకుంటా. - కునాల్ శర్మ, విద్యార్థి.

3. నా కాబోయే భార్య స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నా. తను కచ్చితంగా మంచి వ్యక్తయి ఉండాలి. తన కాళ్ల మీద తాను నిలబడగలిగి, భావోద్వేగాల పరంగానూ బలంగా ఉండే అమ్మాయంటే నాకు ఇష్టం - తుహినాన్షు, వ్యాపారవేత్త


4. నా భార్య సరదాగా గడిపే వ్యక్తయి ఉండాలి. నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా.. కాబట్టి తను కొంచెం అల్లరిగా, చిలిపిగా ఉండేదై ఉండాలి. ఇలా ఉండటం వల్ల అనుబంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది - శుభమ్ అగర్వాల్, వీడియో బ్లాగర్

5. నా విషయానికి వస్తే నమ్మకం అనేది ముఖ్యం. బిజినెస్ పని మీద నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటా. ఈ విషయంలో తను గొడవ పడొద్దని కోరుకుంటున్నా. నాతో ఎవరున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను తదితర అంశాల గురించి తను పట్టించుకోకపోతే మంచిది. నమ్మకం అనేది రిలేషన్‌షిప్‌లో వెన్నెముక లాంటిది. నమ్మకం లేకుండా ఎవరూ వివాహ జీవితంలో సంతోషంగా ఉండలేరు - నితీష్ అగర్వాల్, వ్యాపారవేత్త.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.