యాప్నగరం

​భార్యలపై భర్తల ప్రధాన ఫిర్యాదు అదే..!

భార్య లేదా ప్రియురాలిపై ఫిర్యాదులు చెప్పమంటే.. మగవాళ్లు ఎన్నైనా చెప్పగలరు. ఈ విషయంలో ఆడవాళ్లకు కూడా

TNN 20 Jul 2017, 2:34 pm
భార్య లేదా ప్రియురాలిపై ఫిర్యాదులు చెప్పమంటే.. మగవాళ్లు ఎన్నైనా చెప్పగలరు. ఈ విషయంలో ఆడవాళ్లకు కూడా బోలెడన్ని ఫిర్యాదులు ఉంటాయి. భర్త లేదా ప్రియుడి తీరులో బోలెడన్ని లోపాలను ఎంచగలరు వాళ్లు కూడా. ఈ కంప్లైంట్లు అనేక రకాలు. అలాంటి వాటిలో సెక్సువల్ మ్యాటర్స్‌ కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇలాంటి కంప్లైట్స్ ను అందరితోనూ చెప్పుకోలేరు కానీ.. ఏ సెక్సాలజిస్టులతోనో, సైకాలజి కౌన్సెలర్లతో అయితే చెప్పుకుంటారు. అలాంటి రిపోర్టుతోనే వచ్చింది ట్రేసీ కాక్స్ అనే సెక్సాలజిస్టు.
Samayam Telugu she doesnt initiate sex is the top male complaint
​భార్యలపై భర్తల ప్రధాన ఫిర్యాదు అదే..!


ఈమె ఒక ప్రముఖ యూరోపియన్ సెక్సాలజిస్టు. చాలా సంవత్సరాల అనుభవంతో.. సెక్స్ విషయంలో బోలెడన్ని థియరీలను రాసిందీమె. వాటిల్లో ఒకటి తాజాగా ప్రచురితం అయ్యింది. సెక్స్ విషయంలో భార్యభర్తలు లేదా, ప్రేయసీప్రియుల మధ్య ప్రధానంగా ఎక్కడ తేడా కొడుతుందో ట్రేసీ వివరించారు. తన దగ్గరకు వచ్చిన జంటల్లో మగవాళ్లు తమ ఆడవాళ్లపై ప్రధానంగా ఒక కంప్లైంట్ చేశారని ట్రేసీ వివరించింది. ఏమిటా కంప్లైంట్ అంటే.. సెక్స్ విషయంలో తమ లేడీస్ చొరవ చూపరు! అనేది.

ట్రేసీ ప్రధానంగా యూరోపియన్ కల్చర్ వారినే ట్రీట్ చేసింది. ఆ పాశ్చాత్య కల్చర్ లోనే.. ఇలాంటి ఫిర్యాదు ప్రధానంగా వినిపించడం గమనార్హం. దశాబ్దాల పాటు దాంపత్యాన్ని కొనసాగించిన మగవాళ్లు కూడా ఈ ఫిర్యాదు చేశారట. తమ పార్ట్‌నర్ దగ్గర ఎప్పుడూ తామే చొరవ తీసుకోవాల్సి వస్తోందని, ఆమె అస్సలు ఇన్షేయేటివ్ గా ఉండదని తన దగ్గరకు వచ్చిన మగవాళ్లు వాపోయారని ట్రేసీ చెప్పింది.

తమ భార్యలకు తాము సర్వస్వతంత్రాలనూ ఇచ్చినా.. అక్కడ మాత్రం మళ్లీ తామే చొరవ చూపాల్సి వస్తోందని, సెక్స్ అనేది కేవలం తమ ఇంట్రస్ట్ మాత్రమే అనిపిస్తోందని.. మగవాళ్లు చెప్పారట. మీరు ముందుకొచ్చారు కాబట్టి... శృంగారం చేస్తున్నాం లేకపోతే జరిగేది కాదు.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని.. ఇది తమను బాగా నిరాశ పరుస్తోందని, సెక్స్ విషయంలో ఆడవాళ్ల తీరుపై ఇదే తమ ప్రధానమైన కంప్లైట్ అని ఎక్కువ శాతం మగవాళ్లు ట్రేసీకి వివరించి చెప్పారట. ఆడవాళ్లు ఈ తీరును మార్చుకుంటే.. వారి భర్తలు అమితంగా ఆనందిస్తారని ట్రేసీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.