యాప్నగరం

మీ పార్టనర్ వేరే వారికి దగ్గరవుతున్నప్పుడు ఇలా చేస్తారట..

నేటి కాలంలో రిలేషన్స్ ఫెయిల్ అయిపోవడం కామన్. చాలా మంది ఇష్టంగా పెళ్ళి చేసుకున్నా అది చాలా కాలం ఉండడం లేదు.

Authored byరావుల అమల | Samayam Telugu 6 Dec 2023, 5:12 pm
ఇష్టపడి పెళ్ళి చేసుకునేవారు దూరమవ్వడానికి ముఖ్య కారణాల్లో అక్రమ సంబంధాలు. ఇద్దరి మధ్యలో వేరే వ్యక్తి వచ్చి చేరడంతోనే పచ్చని సంసారంలో చిచ్చు రేపుతోంది. అయితే, ఇదంతా జరిగాక బాధపడే బదులు.. సమస్య మొదట్లోనే గుర్తించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని టిప్స్. వేరే సంబంధం పెట్టుకునే వారిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. అవేంటో తెలుసుకోండి.
Samayam Telugu signs of cheating partner and how to deal
మీ పార్టనర్ వేరే వారికి దగ్గరవుతున్నప్పుడు ఇలా చేస్తారట..


ఫోన్‌తోనే టైమ పాస్..

మీ పార్టనర్ ఎక్కువగా ఫోన్స్ వాడడం, మాట్లాడడం, మెసేజ్ చేయడం చేస్తుంటే ఓ కంట కనిపెట్టండి. ఫోన్ వాడే అందరూ తప్పు చేసినట్టు కాదు. పని ఉండి కూడా వాడుతుంటారు. కానీ, ఇలాంటి వారు వేరేవారికి దగ్గరయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఫోన్‌తోనే కాలం గడిపే వారికి గమనిస్తుండడం మంచిది.

ప్రేమ తగ్గడం..

కపుల్స్ మధ్య చిన్న చిన్న సరదాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ప్రేమగా మాట్లాడడం. కానీ, వారు వేరే వారికి దగ్గరవుతుంటే ఇలాంటివి కరువైపోతాయి. కాబట్టి, ఇలాంటి విషయాలని గమనించండి.

సీక్రెట్ మెంటెయిన్ చేయడం..

కపుల్స్‌లో ఎవరైనా సరే ఇంతకు ముందులా ఫ్రీగా ఉండలేరు. వారి ఫోన్స్, గ్యాడ్జెట్స్‌ని దాచేస్తుంటారు. పాస్‌వర్డ్స్ పెట్టుకోవడం ఎప్పుడు వాటి చుట్టూనే ఉంటారు. సో.. ఇలాంటివి చేసినా కాస్తా అనుమానించాల్సిందే.
Also Read : Couple Fights: భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేది.. ఈ కారణాల వల్లే..!

టైమ్ స్పెండ్ చేయకపోవడం..

అదే విధంగా మీ పార్టనర్ మీతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడకపోయినా ఎప్పుడు వారి పనిలో వారు మాత్రమే ఉంటే వారు మీకు దూరంగా అయినట్టని గమనించండి. అదే విధంగా శృంగార పరంగా కూడా మీకు దూరంగా ఉంటారు. దీని వల్ల చాలా సమస్యలొస్తాయి. కాబట్టి అలా చేస్తుంటే గమనించడం ముఖ్యం.

బయటికెళ్ళడం..

చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళడం, ఏదో పని ఉందంటూ సాకులు చెప్పడం, ఎక్కువగా బయట ఉంటే కూడా ఏదో తప్పు జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.
Also Read : మగవారిని ఆడవారు ఈ ప్రశ్నలడిగితే అస్సలు నచ్చదట..

ఇది గుర్తుపెట్టుకోండి..

అయితే, ఇవన్నీ చేస్తే తప్పు చేస్తున్నట్టు కాదు. కాస్తా గమనించాలి. ఇవన్నీ బిజీగా ఉన్నా కూడా చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అంతే తప్పా తప్పు చేస్తున్నారని కాదు. ఏదైనా మరీ ఎక్కువ రోజులు కొనసాగితే కూర్చుని మాట్లాడి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడం మంచిది.
​​గమనిక : ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.
​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​Read More : Relationship News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.