యాప్నగరం

ఫిజికల్ రిలేషన్ ఫర్పెక్ట్‌గా ఉంటే చాలు

చాలామంది కపుల్స్ వాళ్ల రిలేషన్ కి కొంతకాలంలోనే బ్రేక్ అప్ చెప్పడానికి కారణం వారి మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ హ్యాపీగా లేకపోవడమే.

TNN 25 Nov 2016, 9:30 pm
చాలామంది కపుల్స్ వాళ్ల రిలేషన్ కి కొంతకాలంలోనే బ్రేక్ అప్ చెప్పడానికి కారణం వారి మధ్య అంతగా ప్రేమలేకపోవడం ఒక కారణం కావొచ్చు. ఇద్దరి మధ్య చిన్నచిన్న సమస్యలు పెద్దగా మారడం కావొచ్చు. వీటికన్నా మరో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే వారిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్‌షిప్ హ్యాపీగా లేకపోవడమే. చాలామంది మెకానికల్‌గా ఆ పని పూర్తి చేస్తుంటారు. ఆ సమయంలో ఇద్దరూ కనెక్ట్ అయ్యామని భావించకపోతే జీవితంలోనూ వారు కలిసి ఉండటం చాలా కష్టం. అయితే వైఫ్ అండ్ హజ్బెండ్ మధ్య ఫిజికల్ రిలేషన్ ని బలంగా మార్చే కొన్ని విషయాలు ఏమిటో ఒకసారి చూద్దామా.
Samayam Telugu some ways to strengthen your physical relationship
ఫిజికల్ రిలేషన్ ఫర్పెక్ట్‌గా ఉంటే చాలు


చాలామంది భర్తలు భార్యలను అంత ప్రేమగా టచ్ చేయడానికి ఇష్టపడరు. దీంతో వారి మధ్య ప్రేమ తగ్గిపోతుంది. ఒకరినొకరు టచ్ చేసుకోవడం వల్ల వాళ్ల బంధం బలమవుతుంది. దాదాపు 85శాతం మందికి పైగా మహిళలు తమ భాగస్వామి తమను బిగి కౌగిళ్లలోకి తీసుకోవాలని అనుకుంటారు. తరచుగా హజ్బెండ్ అలా చేస్తే వారిలో సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుందంట. ఇద్దరి మధ్య శారీరక బంధాన్ని బలపరచడానికి కేవలం సెక్స్ ఒక్కటే సరిపోదు. కౌగిలింతలు, దగ్గరకు తీసుకోవడం వంటి రొమాంటిక్ విషయాలు కూడా ఇద్దరి మధ్య ఫిజికల్ కనెక్షన్స్ ని బలంగా మారుస్తాయి.

కేవలం బెడ్ పైనే ఆమెతో ప్రేమగా మెలిగితే సరోపోదు.ఇతర సమయాల్లోనూ ఆమెను ఆప్యాయంగా చూసుకోవాలి. అలా చేస్తేనే ప్రేమలో నిజాయితీ ఉందని తను భావిస్తుంది. ఎమోషనల్ కనెక్షన్ లేదా ఇంటెలెక్చువల్ కాంటాక్ట్ కంటే అఫెక్షనేట్ టచ్ చాలా పవర్ ఫుల్ అంట. ఎవరైతే రెగ్యులర్ గా కౌగిలించుకుంటారో.. వాళ్లలో బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయంట. ఇలా అన్ని విషయాల్లోనూ వైఫ్‌నకు నచ్చినట్లుగా చేస్తుంటే మీ బంధం బలంగా ఉంటుంది. లేకపోతే అనవసరంగా జీవితాలను నాశనం చేసుకున్న వాళ్లు అవుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.