యాప్నగరం

ఆ వేళలో ఈ పనులు అస్సలు చేయొద్దు

శృంగారంలో పాల్గొనే సమయంలో కొన్ని పనులు అసలే చేయకూడదట. ఈ పనులు చేయడం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Samayam Telugu 1 Mar 2017, 4:23 pm
శృంగారంలో పాల్గొనే సమయంలో కొన్ని పనులు అసలే చేయకూడదట. ఈ పనులు చేయడం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ.. అసురక్షిత లైంగిక చర్యలో పాల్గొనకూడదు. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనాల్సి వస్తే.. కచ్చితంగా కండోమ్ ఉపయోగించాలి. లేదంటే అవాంఛిత గర్భం వచ్చే అవకాశాలతోపాటు.. సుఖ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కండోమ్ లేకుండానే చేద్దాం ఫర్వాలేదని పార్టనర్ బలవంతపెట్టినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయొద్దు. హెచ్‌ఐవీ లాంటి ప్రాణాంతక వ్యాధులే రానక్కర్లేదు.. గనేరియా, సిఫిల్స్ లాంటి ఎస్టీడీ వ్యాధులు వచ్చినా సుదీర్ఘ కాలంపాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu things you must never do when having sex
ఆ వేళలో ఈ పనులు అస్సలు చేయొద్దు


పార్టనర్ లాటెక్స్ కండోమ్ వాడుతున్నప్పుడు.. స్త్రీలు లూబ్రికేషన్ కోసం ఆయిల్స్, ఆయిల్ బేస్‌డ్ లూబ్స్‌ను వాడొద్దు. ఇలా చేయడం వల్ల కండోమ్ చిరిగిపోయే అవకాశం ఉంది. లాటెక్స్‌తో వాటర్ లేదా సిలికాన్ బేస్డ్ లూబ్రికెంట్లను మాత్రమే వాడాలి. మెంథాల్ లూబ్స్ వాడటం వల్ల కొందరు మహిళల్లో ఇరిటేషన్ కలుగుతుంది.

ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన్నా, రఫ్‌గా సెక్స్ చేసినా.. ప్రైవేట్ పార్ట్స్ దెబ్బతింటాయి. ఒకవేళ మీకు అలా నొప్పిగా అనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడంతోపాటు కొద్ది రోజులపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.