యాప్నగరం

మా ఆయనకి విపరీతమైన కోపం.. ఆ కోపంలో ఏం చేస్తాడంటే..

తనకి ఉన్న సమస్యని దాచి ఓ వ్యక్తి పెళ్ళి చేసుకున్నాడు. కొన్నిరోజులు సజావుగానే సాగిన వారి సంసారంలో ఇప్పుడు దాచిన నిజం నిప్పులా మారి వారిద్దరి మధ్య చిచ్చుపెడుతోంది. అసలు వచ్చిన సమస్య ఏంటి.. నిపుణులు ఏం చెబుతున్నారు. 

Produced byరావుల అమల | Samayam Telugu 5 Mar 2023, 1:11 pm
అరెంజ్డ్ మ్యారేజ్‌లో కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం, నిజాలు దాయడం జరుగుతుంది. ఇవి చిన్నవైతే పర్లేదు. కానీ, పెద్దవి అయినప్పుడు జరిగే ఘటనలు మనసుని ఇబ్బంది పెడతాయి. వేయి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్ళి చేయొచ్చు అంటారు. కానీ, ఇది కొన్నిసార్లు ఆ రిలేషన్‌ని ప్రాబ్లమ్స్‌కి గురి చేస్తుంది. ఇలానే ఓ వ్యక్తి నిజాన్ని దాచి పెళ్ళి చేసుకున్నాడు. విషయం తెలిసిన మహిళ విడిపోవాలనుకుంటోంది. ఆమెకి నిపుణులు ఏం సలహా ఇస్తున్నారో తెలుసుకోండి.
Samayam Telugu tips for coping with a bipolar husband
మా ఆయనకి విపరీతమైన కోపం.. ఆ కోపంలో ఏం చేస్తాడంటే..


ప్రశ్న ..

హాయ్, మేము కలిసి మాట్లాడుకుని 7 నెలలు అర్థం చేసుకున్నాక మ్యారేజ్ చేసుకున్నాం. ఇది కూడా అరెంజ్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన మొదట్లో బాగానే ఉండేది. కానీ, రాను రాను నా భర్త గురించి ఓ నిజం తెలిసింది. అది నా భర్తకి మొదట్లో కొద్దిగా కోపం వచ్చేది. ఇది కామన్ కదా అని నేను లైట్ తీసుకున్నా. తర్వాత అది రోజురోజుకి ఎక్కువవుతుంది. ఆ కోపంలో తను విపరీతంగా ప్రవర్తించేవాడు. వస్తువులు పారేయడం, కొట్టడం ఇలా చేస్తుండేవాడు. తర్వాత కాసేపటికే మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు. కానీ, ఆ తర్వాత కొన్ని రోజులకి అతని బంధువు ద్వారా నాకు అసలు విషయం తెలిసింది. అదేంటంటే..

బైపోలార్ డిసార్డర్ ఉన్న భర్తతో..

నా భర్తకి బైపోలార్ డిసార్డర్ సమస్య ఉంది. దీంతో నా కాళ్ళకింద భూమి కంపించినట్టు అయింది. ఈ సమస్య ఉన్నవారు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఒక్కోసారి బావుంటారు. ఒక్కోసారి సైకోలా ప్రవర్తిస్తుంటారు. ఇది మా మ్యారేజ్‌కి ముందే తనకి ఉందని అది కూడా 5 సంవత్సరాల ముందే ఉందని తెలిసింది. దీంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాకు ఓ పాప. నా భర్త కోపంతో నన్ను, నా పాపని కూడా కొడుతున్నాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయా.. ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడు. అతడితో కాపురం చేయలేకపోతన్నా.. విడిపోవాలా.. విడిపోయాక నా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఏంటి.. మీరే నాకు సలహా ఇవ్వండి.
Also Read : Small Bedroom : చిన్నగా ఉన్న బెడ్‌రూమ్‌ని ఇలా సర్దితే పెద్దగా కనిపిస్తుంది..

నిపుణుల సలహా..

మీ భర్త మానసిక సమస్య గురించి దాచి మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం నిజంగా తప్పే. కానీ, సమస్య గురించి మీకు తెలిసేసరికి అప్పటికే మీకు పాప ఉంది. ఇదివరకైతే మీరు ఒక్కరే. కానీ, ఇప్పుడు మీకు ఓ పాప. ఆ పాపపై తనకి కూడా బాధ్యత ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడేందుకు విడాకులు తీసుకోవచ్చు. కానీ, విడాకులు మాత్రమే పరిష్కారం కాదు.
Also Read : Tea for Digestion : ఈ టీలు తాగితే జీర్ణ సమస్యలు ఇట్టే దూరమవుతాయట..

ప్రయత్నించండి..

జీవితంలో కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే చిక్కుల్లో పడతాం. కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పటికీ రెడీగా ఉండాలి. ఏ సమస్య నుంచైనా బయటపడేందుకు మన ప్రయత్నం కచ్చితంగా ఉండాలి. అయితే, మీ విషయంలో మీరు ఆ బంధం నుంచి బయటపడకుండా సమస్య నుంచి మాత్రమే బయటపడడం మంచిదని నేను చెబుతా. ఎందుకంటే, ఇప్పుడు మీకు పాప ఉంది. మీరు చేసే ప్రతి పని కూడా తనని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. కాబట్టి, మీరు ఏం చేసినా ఫ్యూచర్‌లో తను కూడా ఇబ్బంది పడతుంది.
Also Read : Diabetes Winter Care : షుగర్ ఉన్నవారు చలికాలంలో ఈ జాగ్రత్తలు

సమస్య పరిష్కారమవ్వాలంటే..

వేల యుద్ధాలు కూడా ఒక్క మాటతో ఆగిపోతాయి. మాటకి ఉన్న పవర్ అలాంటిది. అందుకే మీరు ఓ సారి మీ హజ్బెండ్‌తో కూర్చుని మాట్లాడండి. కోపంలో తను ఏం చేస్తున్నాడో అతనికి తెలియజేయండి. అదే విధంగా తన సమస్య పరిష్కారం కోసం ఇద్దరు కలిసి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ముందుగా డాక్టర్‌‌ని కలిస్తే తనని పరీక్షించి ఏవైనా మందులు మీకు సజెస్ట్ చేస్తారు. ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఏ పని చేయొద్దు.

గమనిక : ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.