యాప్నగరం

మన మాట వినేలా ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడమెలా?

మనుషులన్నాక ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. దైనందన జీవితంలో ఎంతో మందితో మాట్లాడాల్సి ఉంటుంది.

TNN 26 Feb 2017, 3:41 pm
మనుషులన్నాక ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. దైనందన జీవితంలో ఎంతో మందితో మాట్లాడాల్సి ఉంటుంది. కాలేజీలో, ఆఫీసులో చాలా మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. కొందరికి కోపం ఎక్కువగా ఉంటే, కొందరేమో అస్సలేం మాట్లాడరు. మరికొందరు ఇంటెలిజెంట్‌గా ఉంటే.. కొందరేమో స్టుపిడ్‌లా ప్రవర్తిస్తుంటారు. ఇలా విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులను అర్థం చేసుకోవడం చాలా కష్టం కదూ. కానీ ఇలాంటి వారందర్నీ కంట్రోల్ చేయడానికి చాణక్యుడు కొన్ని సూచనలు చేశాడు. వాటిని పాటిస్తే.. ఎలాంటి వారినైనా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఆడ, మగ అనే తేడా లేకుండా వారిని హిపట్నైజ్ చేయవచ్చు.
Samayam Telugu tricks to control people of different nature behaviour and become successful in life
మన మాట వినేలా ఎదుటి వ్యక్తిని కంట్రోల్ చేయడమెలా?


రివర్స్ సైకాలజీ అనేది చాలా ముఖ్యమని చాణక్యుడు భావించాడు. ఇంతకూ చాణక్యుడు చెబుతున్న ట్రిక్స్ ఏంటంటే..

చిన్నపిల్లల విషయంలో.. ఐదేళ్లు వచ్చే వరకూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారిపై అమితమైన ప్రేమను కనబర్చాలి. వారు పదేళ్లకు చేరిన తర్వాత చెడుగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించవద్దు. 16 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితుల్లా మెలగాలి.

అహంకారంగా ఉండే వారితో... మర్యాదగా మసులుకోవాలి. ఇలా చేయడం వల్ల వారి మనసుల్ని గెలుచుకోవచ్చు. ఎదుటి వ్యక్తి మన మాట వినాలంటే ఇది ఎంతో ముఖ్యం.

తెలివైన వారితో ఎప్పుడూ నిజాలే మాట్లాడాలి. నిజం చెప్పేవారు, నిజాయతిగా ఉండే వారంటే తెలివైన వారే కాదు, ఎవరైనా ఇష్టపడతారు.

దురాశపరులను ధనం ఆశ చూపి బుట్టలో వేసుకోవచ్చు. ఏ పనై కావాలంటే వీరికి కాస్త డబ్బు ఇస్తే సరి.

మీరంటే గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదు. బాగా డబ్బు సంపాదించాలని భావిస్తే ధనవంతులు ఉండే ప్రాంతానికి వెళ్లండి. అదే తెలివితేటలు పెంపొందించుకోవాలి భావిస్తే మాత్రం... పండితుడి దగ్గరకు వెళ్లండి.

మీరు హంసల్లాగా జీవించండి. అవి ఎలాగైతే నీరు ఉన్నప్పుడు మాత్రమే ఉండి, సరస్సు ఎండిపోయినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోతాయో మీరు కూడా అలాగే ఉండాలి.

ఎక్కడైతే మూర్ఖులను పూజించరో, ఎక్కడైతే సరిపడా ఆహారం లభిస్తుందో, ఎక్కడ భార్యాభర్తలు గొడవ పడారో అలాంటి చోట ధనలక్ష్మి నివాసం ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.