యాప్నగరం

ప్రేమలో సెక్స్‌ను కోరుకునేది ఆడా? మగా?

ప్రేమ బంధంలో, ఆడ-మగ అనుబంధంలో.. సెక్స్ పట్ల ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది? ఇష్టమైన వారి సాన్నిహిత్యంలో శృంగారాన్ని కోరుకునేది ఎవరు?

TNN 6 Oct 2017, 3:04 pm
ప్రేమ బంధంలో, ఆడ-మగ అనుబంధంలో.. సెక్స్ పట్ల ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది? ఇష్టమైన వారి సాన్నిహిత్యంలో శృంగారాన్ని కోరుకునేది ఎవరు? ఈ విషయంలో ఆడవాళ్లు ముందుంటారా? మగవాళ్లు ఎక్కువ ఆసక్తిని చూపుతారా? అంటే.. ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇస్తోంది ఒక బ్రిటన్ అధ్యయన సంస్థ. సెక్స్ విషయంలో సహజమైన ఆసక్తిని పక్కన పెట్టి.. ఒక ప్రేమబంధం ఏర్పడ్డాకా, శృంగారం విషయంలో ఆసక్తి ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే.. నిస్సందేహంగా ‘ఆడవాళ్లలోనే..’ అంటోంది ఈ అధ్యయనం.
Samayam Telugu who wants sex more in relationships men or women
ప్రేమలో సెక్స్‌ను కోరుకునేది ఆడా? మగా?


ఇది బ్రిటన్ కేంద్రంగా జరిపిన అధ్యయనం. కొన్ని వేల మంది యువతీయువకుల అభిప్రాయాలను తీసుకుని ఈ అధ్యయనాన్ని చేశారట. 18 యేళ్ల పై పడ్డవారిని ఎంపిక చేసి ఈ అధ్యయనం జరిగిందని సమాచారం.

మరి ఇందులోని లెక్కలు ఎలా ఉన్నాయంటే.. తమ మనసుకు నచ్చిన పురుషుడితో తనువును పంచుకోవడానికి 59 శాతం మంది మహిళలు సిద్ధంగా ఉన్నారట. అదే పురుషుల విషయానికి వస్తే ప్రేమ బంధంతో పడక సుఖం వైపు వెళ్లడానికి 41 శాతం మాత్రమే సంసిద్ధం వ్యక్తం చేశారట. వోచర్ కోడ్స్ ప్రో అనే అధ్యయన సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సహజంగా మగవాళ్లకే శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి విరుద్ధంగా.. ప్రేమ, సాన్నిహిత్యంలో.. సెక్స్ పట్ల ఆడవాళ్లకే ఆసక్తి ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.