యాప్నగరం

మ్యాచ్ ఆడుతుండగానే మనీష్ పాండేకి మ్యారేజ్ ప్రపోజల్

ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆడుతున్న భారీ షాట్స్‌ని, ఆ భారీ షాట్స్ కొట్టే బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసే బౌలర్స్ ఆటని...

Mid-day 11 Apr 2017, 3:03 pm
ఐపీఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆడుతున్న భారీ షాట్స్‌ని, ఆ భారీ షాట్స్ కొట్టే బ్యాట్స్‌మెన్ వికెట్లు తీసే బౌలర్స్ ఆటని ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం సర్వసాధారణం. కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరేట్ క్రికెటర్స్ ఆడే ఆటకి ఎంత మంత్ర ముగ్ధులవుతారంటే.. వారి మీద తమకున్న అభిమానాన్ని, అభిప్రాయాన్ని బయటపెట్టుకోకుండా ఉండలేరు. తాజాగా మనీష్ పాండే ఆట విషయంలోనూ అటువంటి ఘటనే చోటుచేసుకుంది.
Samayam Telugu manish pandey got marriage proposal during kkr vs mi match
మ్యాచ్ ఆడుతుండగానే మనీష్ పాండేకి మ్యారేజ్ ప్రపోజల్


గత ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయం అది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున బ్యాటింగ్‌కి వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే అప్పటికే ఒకానొక స్టేజ్‌లో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్న జట్టుని ఆదుకునే బాధ్యతని తన భుజానేసుకున్నాడు.

2 సిక్సులతోపాటు భారీగా ఫోర్లు బాదుతూ 47 బంతుల్లో 81 పరుగులు సాధించి జట్టుని 178/7 స్కోర్‌తో ఓ మోస్తరు స్థానానికి తీసుకెళ్లాడు మనీష్. ముఖ్యంగా చివరి సింగిల్ ఓవర్‌లో 23 పరుగులు రాబట్టిన మనీష్ పాండే షాట్స్ చూసి క్రికెట్ ఫ్యాన్స్ భలే ఎంజాయ్ చేశారు. అన్నింటికిమించి కేవలం 2 లీగల్ డెలివరీలతో 18 పరుగులు సాధించి ఐపీఎల్‌లోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు మనీష్ పాండే.
manish pandey marry me— Nishu✌ (@NishuSRKian) April 9, 2017
మనీష్ పాండే పర్ ఫార్మెన్స్ చూసి ఫుల్ ఫిదా అయిపోయిన ఓ లేడీ ఫ్యాన్... 'మనీష్ పాండే మ్యారీ మీ' అంటూ ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అతడు మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే ఆమె ఈ ట్వీట్ చేసింది. మనీష్ పాండే ఆడిన ఆటకి ఎన్నో ప్రశంసలు, కితాబులు వచ్చాయి కానీ లేడీ ఫ్యాన్ చేసిన ఈ ట్వీట్ మాత్రమే సోషల్ మీడియా ఫోలోవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. బహుషా ఈ ట్వీట్ మనీష్ పాండే కంటపడిందో లేదో కానీ తెలిస్తే ఏమని రిప్లై ఇచ్చేవాడో మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.