యాప్నగరం

వేలిముద్రతో పనిచేసే క్రెడిట్ కార్డ్!

ఇప్పటి వరకు నాలుగంకెల సీక్రెట్ కోడ్‌తో వాడుతున్న క్రెడిట్ కార్డులను ఇక మీదట మరింత భద్రంగా వాడుకోవచ్చు.

TNN 20 Apr 2017, 5:21 pm
ఇప్పటి వరకు నాలుగంకెల సీక్రెట్ కోడ్‌తో వాడుతున్న క్రెడిట్ కార్డులను ఇక మీదట మరింత భద్రంగా వాడుకోవచ్చు. మీ పిన్‌ని ఎవరైనా కాపీ చేస్తారనే భయం కూడా ఇకపై మీకు ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, సీక్రెట్ లాకర్లకు అందుబాటులో ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ భద్రతను క్రెడిట్ కార్డులకు ఎందుకు అన్వయించకూడదనే ఆలోచన మాస్టర్‌కార్డ్ సంస్థకు కలిగింది. అంతే ఈ టెక్నాలజీతో క్రెడిట్ కార్డును రూపొందించింది.
Samayam Telugu mastercards new credit card has a built in fingerprint scanner
వేలిముద్రతో పనిచేసే క్రెడిట్ కార్డ్!


కార్డుకి కుడివైపు పైన ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చారు. ఇది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న క్రెడిట్ కార్డుల్లానే సన్నగానే ఉంది. డిజైన్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఈ కార్డును వాడేటప్పుడు మనకు పిన్‌తో పనిలేదు. స్వైపింగ్ మెషీన్‌లో కార్డును పెట్టినప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ వద్ద మీ బొటనవేలును పెడితే సరిపోతుంది. వేరొకరి వేలిముద్రతో ఈ కార్డు పనిచేయదు కాబట్టి కార్డ్ హోల్డర్‌కి మరింత భద్రత ఉన్నట్లే.

ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డులను దక్షిణాఫ్రికాలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు మాస్టర్‌కార్డ్ స్పష్టం చేసింది. త్వరలో యూరప్, ఆసియా-పసిఫిక్ దేశాల్లో కూడా ఈ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. తాము రూపొందించిన ఈ కొత్త కార్డులతో వినియోగదారులకు మరింత భద్రతను కల్పిస్తామని మాస్టర్‌కార్డ్ చీఫ్ అజయ్ భల్లా తెలిపారు. స్మార్ట్‌ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసుకొచ్చిన తరవాత కార్డుల్లో కూడా దీన్ని పెట్టడం చాలా సులభమని తమకు తెలిసిందని చెప్పారు. సెక్యూరిటీ ఎక్స్‌పర్టులు కూడా పిన్ కంటే వేలిముద్ర ఉత్తమమని చెప్పడంతో తాము ఈ కొత్త కార్డును తయారుచేశామన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.