యాప్నగరం

ధోనీ ఫినిషింగ్ వీడియో.. ఓ లుక్కేయండి

అత్యుత్తమ బౌలింగ్ విభాగం ఉన్నహైదరాబాద్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన

TNN 22 Apr 2017, 9:30 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పుణె వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌ను రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (61 నాటౌట్: 34 బంతుల్లో 5x4, 3x6) అబ్బురపరిచే రీతిలో హిట్టింగ్ చేసి గెలుపుగా ముగించాడు. 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పుణె జట్టు విజయానికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి రావడంతో అత్యుత్తమ బౌలింగ్ విభాగం ఉన్నహైదరాబాద్ గెలుస్తుందని అంతా భావించారు. అయితే ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ క్రీజులో ఉండటంతో పుణె శిబిరం కూడా ఆశతోనే ఉంది. కానీ.. సీజన్‌లో ఇప్పటి వరకు ధోనీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరగబోతుందోనని అంతా ఆసక్తిగా చూశారు.
Samayam Telugu ms dhoni helps rising pune supergiant clinch thriller v sunrisers hyderabad
ధోనీ ఫినిషింగ్ వీడియో.. ఓ లుక్కేయండి



తాజా ఐపీఎల్‌లో బెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందిన భువనేశ్వర్ కుమార్‌కి సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బంతినిచ్చాడు. తొలి రెండు బంతుల్ని కళాత్మక షాట్లతో బౌండరీకి తరలించిన ధోని.. మూడో బంతిని ఏకంగా సిక్స్‌గా మలిచి భువనేశ్వర్‌ని ఒత్తిడిలో పడేశాడు. తర్వాత ఓవర్‌లో చివరి బంతికి కూడా రెండు పరుగులు అవసరం కాగా.. తనదైన స్టైల్‌లో ఫోర్ బాది ధోని మ్యాచ్‌ని ముగించాడు. సీజన్‌ల్ ఆరంభంలో స్టీవ్‌స్మిత్ మ్యాచ్‌ని గెలిపిస్తే.. ‘అడవికి రాజు ఎవరో తేలిపోయింది’ అంటూ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీ సహ యజమాని హర్షా గోయెంకా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజా మ్యాచ్‌లో స్టీవ్‌స్మిత్ తేలిపోగా.. ధోనీ మళ్లీ ఫినిషర్‌గా నిరూపించుకోవడంతో అభిమానులు హర్షాపై సోషల్ మీడియాలో సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.