యాప్నగరం

గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌లోగా ముస్తాఫిజుర్ వచ్చేస్తాడు

ఐపీఎల్‌లో అదరగొడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్. మరో స్టార్ బౌలర్ ఆ జట్టులో చేరనున్నాడు.

TNN 9 Apr 2017, 6:08 pm
ఐపీఎల్‌లో అదరగొడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్. మరో స్టార్ బౌలర్ ఆ జట్టులో చేరనున్నాడు. ఏప్రిల్ 12న ముంబైతో జరగనున్న మ్యాచ్‌లోగా బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజులర్ రహ్మాన్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నాయి. ముస్తాఫిజుర్‌పై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌లో ఆడొద్దని బంగ్లా కెప్టెన్ మష్రాఫ్ మొర్తజా సూచించాడు. బంగ్లా క్రికెట్ బోర్డు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అంగీకరించలేదని వార్తలొచ్చాయి.
Samayam Telugu mustafizur more than likely to join srh in mumbai tom moody
గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్‌లోగా ముస్తాఫిజుర్ వచ్చేస్తాడు


కానీ ముంబైతో మ్యాచ్ నాటికి ముస్తాఫిజుర్ మాతో చేరతాడని సన్‌రైజర్స్ ప్రధాన కోచ్ టామ్ మూడీ మీడియాకు తెలిపాడు. ముస్తాఫిజుర్ గత సీజన్లో 17 వికెట్ల తీసి హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ శ్రీలంక పర్యటనలో ఉండటంతో ఈ బౌలర్ ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. ఫిజ్ జట్టులో చేరితే హెన్రిక్యూస్, బెన్ కట్టింగ్ స్థానంలో అతడు ఆడే అవకాశాలున్నాయి.

ఒకవేళ ముస్తాఫిజుర్ ఐపీఎల్‌లోకి తిరిగి అడుగుపెడితే మే 12న బంగ్లా, ఐర్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న త్రైపాక్షిక సిరీస్ వరకూ సన్‌రైజర్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నాయి. ముస్తాఫిజుర్ చేరికతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.