యాప్నగరం

నేడే కన్నడ సంగ్రామం: మొదలైన పోలింగ్

కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.

Samayam Telugu 12 May 2018, 7:41 am
ర్ణాటకలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. మొత్తం 2600 మంది అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. మొత్తం 222 స్థానాల్లో 4.96 కోట్ల ఓటర్లు.. 55,600 పోలింగ్ బూత్‌ల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Samayam Telugu aa


మొత్తం 224 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. నకిలీ ఓటర్ కార్డులు బయటపడిన నేపథ్యంలో ఆర్.ఆర్.నగర్, అభ్యర్థి మృతితో జయనగర్‌లలో పోలింగ్ వాయిదాపడింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మూడున్నర లక్షల మంది పోలీసులను మోహరించారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకమైనవి. దీంతో, కన్నడ నాటే కాకుండా దేశమంతా ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

ఈ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోదీకి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్‌గా తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి గెలుపు చాలా అవసరమని కాంగ్రెస్ భావిస్తుండగా.. ఎలాగైన కన్నడ నాట మళ్లీ అధికారం సాధించి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. మోదికి ప్రజాధారణ పెరిగిందా, తగ్గిందా? ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందా? తదితర అంశాలను తెలుసుకునేందుకు ఈ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తున్నారు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాకుండా జనతాదళ్ (సెక్యులర్) పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.