యాప్నగరం

మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న నోకియా 3310

స్మార్ట్ ఫోన్ల విప్లవం రాకముందు మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందిన నోకియా.. పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది.

TNN 15 Feb 2017, 12:42 pm
స్మార్ట్ ఫోన్ల విప్లవం రాకముందు మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందిన నోకియా.. పునర్వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే తొలి అండ్రాయిడ్ మొబైల్‌ను చైనా మార్కెట్లో ప్రవేశపెట్టిన హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ బేసిక్ మోడల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది. గతంలో రికార్డు స్థాయిలో అమ్ముడుబోయి.. బండ ఫోన్‌గా పేరొందిన 3310 మోడల్ మొబైల్‌ను తిరిగి లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ మోడల్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయి.. మిగతా పోటీదార్లకు అందనంత ఎత్తులో నోకియాను నిలబెట్టింది.
Samayam Telugu nokia 3310 is coming back to wipe away the competition like a boss
మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న నోకియా 3310


ఈ నెలాఖారులో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో 3310 మోడల్‌ను నోకియా ప్రదర్శించనుంది. సరికొత్త హంగులతో మార్కెట్లోకి రానున్న దీని ధర సుమారు రూ. 4100 అని అంచనా. ఈ ఫోన్ మన్నిక గురించి అందరికీ తెలిసిందే. బ్యాటరీ బ్యాకప్, మూన్ లైట్ డిస్‌ప్లే.. దృఢమైన బాడీ ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. ప్రతిసారీ స్మార్ట్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లడం కుదరదు. అంతే కాకుండా టెలీకాం సంస్థల ఆఫర్లు, వ్యక్తిగత కారణాల రీత్యా ప్రతి ఒక్కరి దగ్గరా ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. కాబట్టి నోకియా బేసిక్ మోడల్ ఫోన్ మరోసారి మార్కెట్లో దుమ్ము దులిపే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం మరోసారి స్నేక్ గేమ్ ఆడేందుకు రెడీగా ఉండండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.