బిగ్ బాస్ షోతో అషూ రెడ్డికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. అంతకు ముందు డబ్ స్మాష్‌తో జూనియర్ సమంత అంటూ అషూ రెడ్డిని అందరూ పొగిడేవారు. అయితే బిగ్ బాస్ తరువాత అషూ రెడ్డి ఇమేజ్ మారిపోయింది. బుల్లితెరపై అషూ రెడ్డిక మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఆమె చేసే అందాల విందుకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. తాజాగా ఆమె పొట్టి బట్టల్లో చేసిన ఫోటో షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది.