మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వివాహం వెంకట చైతన్య జొన్నలగడ్డతో డిసెంబర్ 9న జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌లో వివాహ వేడుక జరుగుతుంది. అయితే, పెళ్లి తంతులో భాగంగా నిహారికను శనివారం పెళ్లి కుమార్తెను చేశారు. నిహారికను పెళ్లికూతురుని చేసిన శుభకార్యాన్ని హైదరాబాద్‌లోని స్వగృహంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.