గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటుచేసిన ఈ బర్త్‌డే పార్టీలో బర్త్‌డే బాయ్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యారు. అలాగే, ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది విచ్చేశారు. అయితే, ఈ పార్టీలో RRR టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సత్కరించడం విశేషం. ఎస్.ఎస్.రాజమౌళి దంపతులు, ఎం.ఎం.కీరవాణి దంపతులు, కాలభైరవ, కార్తికేయ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లను చిరంజీవి, రామ్ చరణ్ సత్కరించారు. అలాగే, ఈ పార్టీలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సందడి చేశారు. ఇంకా జగపతిబాబు, ఉత్తేజ్, సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ తదితరులు పాల్గొన్నారు.