Nara Lokesh Yuvagalam Padayatra Day 121 In Rajampet
నారా లోకేష్ పాదయాత్రకు మాస్ ఫాలోయింగ్
Authored byతిరుమల బాబు | Samayam Telugu10 Jun 2023, 5:57 am
యువగళం పాదయాత్ర రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. 121వ రోజు యువగళం పాదయాత్ర చంటిగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభం కాగా, దారిపొడవునా లోకేష్‌కు మహిళలు, యువకులు, వృద్ధులు ఆత్మీయ స్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, యువత కేరింతలతో పాదయాత్ర హోరెత్తి పోయింది. దారిపొడవునా వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు ప్రభుత్వం అందరి కష్టాలు తీరుస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు లోకేష్. చంటిగారిపల్లె నుంచి ప్రారంభమైన పాదయాత్ర సిద్దవటం, కమ్మపాలెం మీదుగా జంగాలపల్లె విడిది కేంద్రానికి చేరుకుంది. సిద్దవటం ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీఎత్తున ప్రజలు హాజరయ్యారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.