(Photo Credit : Instagram) పూసర్ల వెంకట సింధు.. క్రీడాభిమానులకి పరిచయం అక్కరలేని పేరు. మూడేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారతావనిని మురిపించిన పీవీ సింధు.. సుదీర్ఘ కెరీర్లో అత్యుత్తమ పతకాల్ని భారత్‌కి అందించింది. శుక్రవారం ఈ తెలుగు తేజం 24వ పడిలో అడుగపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకి అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎనిమిదేళ్లకే బ్యాడ్మింటన్‌లోకి అరంగేట్రం చేసిన పీవీ సింధు.. అత్యంత పిన్న వయసులోనే ఒలింపిక్స్ ఫైనల్ ఆడి.. పతకం గెలిచిన భారత క్రీడాకారిణిగా రికార్డులు నెలకొల్పింది. ఈ భారత షట్లర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు.
2/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram)
ఎనిమిదేళ్లకే బ్యాడ్మింటన్ శిక్షణని ప్రారంభించిన పీవీ సింధు.. అండర్-14 కేటగిరీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలుపొందింది.
3/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram)
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం పీవీ సింధు మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది.
4/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram)
2016లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని అందుకున్న పీవీ సింధు
(Photo Credit : Instagram) 2011 కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో పసిడి గెలిచిన పీవీ సింధు.. ఆ తర్వాత 2012 ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకం గెలుపొందింది. 2013లో జరిగిన మలేషియా ఓపెన్‌లో గెలిచిన పీవీ సింధు.. ఫస్ట్ గ్రాండ్ ఫ్రిక్స్ బంగారు పతకాన్ని గెలుపొందింది.
6/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram)
పీవీ సింధు తొలుత కోచ్ మహబూల్ అలీ దగ్గర శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ అకాడమీకి మారింది.
7/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram) పీవీ సింధు పొడగరి కావడం కొన్ని మ్యాచ్‌ల్లో బలమైతే.. మరికొన్ని మ్యాచ్‌ల్లో బలహీనతగా మారుతోంది. అయినప్పటికీ ఈ భారత షట్లర్ మ్యాచ్ మ్యాచ్‌కీ బలహీనతల్ని అధిగమిస్తూ.. బలాల్ని పెంచుకుంటూ టైటిల్ రేసులో దూసుకెళ్తోంది.
8/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram)
భారత్ నుంచి ఒలింపిక్స్‌లో ఆడిన అత్యంత పిన్న వయస్కురాలిగా పీవీ సింధూ అరుదైన రికార్డ్ నెలకొల్పింది.
9/9
హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు.. ఆసక్తికర విషయాలు
(Photo Credit : Instagram) పీవీ సింధు తల్లిదండ్రులు ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్స్.. ఆమె తండ్రి పీవీ రమణకి అర్జున అవార్డు కూడా దక్కింది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.