యాప్నగరం

రోహిత్ అంచనా ఫట్..వార్నర్ వ్యూహం హిట్

పవర్‌ ప్లేలోనే ముంబయి ఓపెనర్ల బౌండరీల జోరుకు అడ్డుకట్ట వేసి వారిని ఒత్తిడిలోకి నెట్టాలనే ఉద్దేశంతో

TNN 9 May 2017, 10:21 am
ఐపీఎల్ పదో సీజన్‌లో రైజింగ్ పుణె మినహా ఏ జట్టూ ముంబయి ఇండియన్స్‌ని ఓడించలేకపోయింది. కానీ.. ఉప్పల్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పక్కా ప్లాన్‌తో ముంబయిని మట్టికరిపించి ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకోవడం హైదరాబాద్‌కి కలిసొచ్చింది. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ మొదటిసారి బ్యాటింగ్ చేసిన జట్టే ఉప్పల్‌లో గెలవడంతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ ముంబయిని 138 పరుగులకే కట్టడి చేసి.. ఆత్మవిశ్వాసంతో 18.2 ఓవర్లలోనే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది.
Samayam Telugu pl 2017 we are treating each match as knockout says david warner after sunrisers hyderabad thrashed mumbai indians
రోహిత్ అంచనా ఫట్..వార్నర్ వ్యూహం హిట్


‘ముంబయి హిట్టర్లను నిలువరించడంలో మా బౌలర్లు సఫలమయ్యారు. మ్యాచ్‌లో స్పిన్నర్లు రషీద్ ఖాన్, నబీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ చివరి వరకూ లయ తప్పకుండా పదునైన బౌలింగ్‌తో పరుగులను నియంత్రించారు. పవర్‌ ప్లేలోనే ముంబయి ఓపెనర్ల బౌండరీల జోరుకు అడ్డుకట్ట వేసి వారిని ఒత్తిడిలోకి నెట్టాలనే ఉద్దేశంతో నబీకి ఆరంభంలోనే బౌలింగ్ ఇచ్చాం. మా వ్యూహం ఫలించి హిట్టర్ సిమన్స్, నితీశ్ రాణా, పార్థీవ్ పటేల్ తొందరగానే వికెట్లు సమర్పించుకున్నారు. ఛేదనలో హెన్రిక్యూస్‌తో కలిసి ధావన్ గుర్తించుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కూడా గెలిచి ప్లేఆఫ్‌ చేరుతాం’ అని హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ధీమా వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం 13మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఏడు విజయాలు.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో 15 పాయింట్లతో ఉంది. శనివారం గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్‌కి చేరిపోతుంది. టోర్నీలో ఇప్పటికే గుజరాత్‌ని హైదరాబాద్ ఒక సారి చిత్తుగా ఓడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.