యాప్నగరం

రిలయన్స్ 'లైఫ్ ఎఫ్1 ఎస్' స్మార్ట్‌ఫోన్

రిలయన్స్ రీటైల్ బ్రాండ్ లైఫ్ నుంచి ఫూచర్ వన్ సిరీస్‌లో 'ఎఫ్1 ఎస్' 4G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా మార్కెట్లో విడుదల అయింది. దీని అసలు ధర రూ. 10,099 కాగా, రూ.500 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు...

TNN 28 Dec 2016, 1:51 pm
రిలయన్స్ రీటైల్ బ్రాండ్ లైఫ్ నుంచి ఫూచర్ వన్ సిరీస్‌లో 'ఎఫ్1 ఎస్' 4G స్మార్ట్‌ఫోన్‌ తాజాగా మార్కెట్లో విడుదల అయింది. దీని అసలు ధర రూ. 10,099 కాగా, రూ.500 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతో రూ.9,599 ధరకే ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనుంది. అదనంగా మార్చి 31 వరకు ఉచిత జియో ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకంగా 'AJIO.com' ద్వారా మాత్రమే వినియోగదారులకు లభించనుంది.
Samayam Telugu reliance lyf f1s smartphone launched exclusively on ajio
రిలయన్స్ 'లైఫ్ ఎఫ్1 ఎస్' స్మార్ట్‌ఫోన్


ఈ స్మార్ట్‌ఫోన్‌ హైబ్రిడ్ సిమ్ కార్డ్ కాన్‌ఫిగరేషన్‌ను కలిగి ఉంది. కాబట్టి ఒక 4జీ, మరో 2జీ సిమ్ లేదా ఒక మైక్రో ఎస్డీ కార్డ్ మాత్రమే అమర్చుకునే వీలుంది.

రిలయన్స్ ఎఫ్1 ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్...

5.2 అంగుళాల టచ్ స్క్రీన్, 1080x1920 పిక్సెల్స్ రెసల్యూషన్
1.4 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 16 మెగాపిక్సెల్ వెనక కెమెరా
3 జీబి ర్యామ్, 32 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం, 128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్
అండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
3000mAh బ్యాటరీ సామర్థ్యం, 4జీ సపోర్ట్
ధర: రూ. 9,599/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.