యాప్నగరం

'లైఫ్ విండ్ 7ఎస్' స్మార్ట్‌ఫోన్ విడుదల

రిలయన్స్ రీటైల్ బ్రాండ్ లైఫ్ నుంచి గతంలో విడుదలైన 'లైఫ్ విండ్7' , 'లైఫ్ విండ్7ఐ' స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌డేటేడ్ వెర్షన్‌గా 'లైఫ్ విండ్7ఎస్' స్మార్ట్‌ఫోన్‌ తాజాగా విడుదల అయింది....

TNN 26 Dec 2016, 2:11 pm
రిలయన్స్ రీటైల్ బ్రాండ్ లైఫ్ నుంచి గతంలో విడుదలైన 'లైఫ్ విండ్7' , 'లైఫ్ విండ్7ఐ' స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌డేటేడ్ వెర్షన్‌గా 'లైఫ్ విండ్7ఎస్' స్మార్ట్‌ఫోన్‌ తాజాగా విడుదల అయింది. దీనిలోని బ్యాటరీ దాదాపు 9 గంటల వరకు 4జీ టాక్ టైమ్, 5 గంటల వరకు వీడియోల వీక్షణం అలాగే 32 గంటల వరకు ఏకదాటిగా సంగీతం వినేందుకు అవసరమయ్యే సామర్థ్యాన్ని నిలుపుకొని ఉంటుందని సంస్థ పేర్కొంది.
Samayam Telugu reliance lyf wind 7s smartphone launched with 4g volte support
'లైఫ్ విండ్ 7ఎస్' స్మార్ట్‌ఫోన్ విడుదల

4జీ సపోర్ట్ , లైట్ సెన్సార్, ఏక్సిలరోమీటర్ తదితర ప్రత్యేకతలున్న 'లైఫ్ విండ్7ఎస్' మొబైల్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

రిలయన్స్ లైఫ్ విండ్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్...

5 అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వెనక కెమెరా
2 జీబి ర్యామ్, 16 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
2250mAh బ్యాటరీ సామర్థ్యం
ధర: రూ. 5,699/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.