యాప్నగరం

23న ధ్యానమనో ప్రస్థానంలో కార్తీక పౌర్ణిమ వేడుకలు

ఈనెల 23న అంటే శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభమవుతాయి.

Samayam Telugu 20 Nov 2018, 9:06 pm
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో సైన్స్ యూనివర్స్, బండ్లగూడ జాగీర్ ఆధ్వర్యంలో ధ్యానమనో ప్రస్థానంలో కార్తీక పౌర్ణిమ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సైన్స్ యూనివర్స్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని సైన్స్ యూనివర్స్ అధ్యక్షులు ఎస్.రాజేంద్ర తెలియజేశారు.
Samayam Telugu Spoorthi


ఈనెల 23న అంటే శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి ధ్యానమనో ప్రస్థానంలోని విశ్వచైతన్య వేదికలో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు ఆరోజు మధ్యాహ్నం వరకు జరుగుతాయి. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి.గౌరీశంకర్, జయ జయ శంకర ఛానల్ సీఈవో డాక్టర్ ఓలేటి పార్వతీశం, ఆల్ ఇండియా రేడియో (హైదరాబాద్) పూర్వ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తు్న్నారు.

వేడుకల్లో భాగంగా సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, పేదలకు వస్త్ర దానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సైన్స్ యూనివర్స్ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.