యాప్నగరం

మది దోచేలా.. మసాలా దినుసులతో మహాగణపతి విగ్రహం

వినాయక చవితి సందర్భంగా భాగ్యనరంలో అరుదైన వినాయకుడు కొలువుదీరాడు. మసాలా దినుసులతో మది దోచేలా గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Samayam Telugu 20 Sep 2018, 4:14 pm
హైదరాబాద్‌లోని అభిమన్యు యూత్ అసోసియేషన్ వనస్థలిపురంలో వెరైటీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పూర్తిగా మసాలా దినుసులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. 500 గ్రాముల గరం మసాలా పొడితో లడ్డును తయారు చేశారు. విగ్రహం తయారీకి 2 కిలోల ధనియాలు, అర కిలో ఎండు మిరపకాయలు, రెండు కిలోల సజీరా, లవంగాలు, మిరియాలు, యాలకులు, బిర్యానీ ఆకులను ఉపయోగించారు.
Samayam Telugu ganesh


ఈ విగ్రహ తయారికీ వారం రోజుల సమయం పట్టింది. గత ఏడేళ్లుగా అభిమన్యు యూత్ అసోషియేషన్ వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తోంది. గతంలో నెయ్యి, పెన్సిళ్లు, ఎరేజర్లు, పేపర్లు, దారాలతో వినాయకుడి ప్రతిమలను ఏర్పాటు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.