యాప్నగరం

Varalakshmi Vratham 2022 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..? ఆగస్టు 5న లేదా 12వ తేదీనా.. పూజా విధానం.. శుభ ముహుర్తం ఎప్పుడంటే...

Varalakshmi Vratham 2022 ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో కొందరేమో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని.. మరికొందరు ఆగస్టు 12వ తేదీన నిర్వహించాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో ఏ తేదీలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలి? పూజా విధానమేంటి.. శుభ ముహుర్తమెప్పుడొచ్చిందనే వివరాలతో పాటు వరలక్ష్మీ వ్రతం కథ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 4 Aug 2022, 11:50 am
Varalakshmi Vratham 2022 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. కానీ ఈసారి జూలై 29వ తేదీన శ్రావణ శుక్రవారం ప్రారంభం కావడంతో కొందరేమో ఆగస్టు 5వ తేదీన వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని.. మరికొందరు ఆగస్టు 12వ తేదీన నిర్వహించాలని చెబుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం 2022 సంవత్సరంలో ఏ తేదీలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలి? పూజా విధానమేంటి.. శుభ ముహుర్తమెప్పుడొచ్చిందనే వివరాలతో పాటు వరలక్ష్మీ వ్రతం కథ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu varalakshmi vratham 2022 know the date shubh muhurat and puja vidhanam and story in telugu
Varalakshmi Vratham 2022 ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది..? ఆగస్టు 5న లేదా 12వ తేదీనా.. పూజా విధానం.. శుభ ముహుర్తం ఎప్పుడంటే...


​వరాలిచ్చే తల్లి..

వరలక్ష్మీ దేవి అంటేనే వరాలిచ్చే తల్లి. తనను మనస్ఫూర్తిగా ఎవరైనా భక్తితో వేడుకుంటే చాలు మనం కోరిన వరాలన్నీ ఇచ్చేస్తుంది. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ఎలాంటి నియమాలు, మడులు, నిష్టలు అవసరం లేదు. కాకపోతే నిగ్రహమైనభక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. ఎందుకంటే వరలక్ష్మీ వ్రతం చాలా పవిత్రమైనది.

​వర అంటే..

ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే గాక మనకు సంపద, ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. ముఖ్యంగా వివాహిత మహిళలు దీర్ఘాయువుతో సుమంగళిగా జీవించేందుకు ఈ వ్రతం తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతారు. లక్ష్మీదేవి అంటే కేవలం ధనమే కాదు.. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇంకా ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైనది అని అర్థం.

ఈసారి రాఖీ ఎప్పుడు కట్టాలి? 11న లేదా 12న.. పౌర్ణమి తిథి ఎప్పుడంటే..

​పూజా విధానం..

శ్రావణ మాసంలో రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి, మండపాన్ని ఏర్పాటు చేయాలి. అనంతరం బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.

​వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..

ఇక అసలు విషయానికొస్తే.. హిందూ పంచాంగం ప్రకారం, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రమే వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అంటే ఆగస్టు 12వ తేదీ శుక్రవారం రోజున పౌర్ణమి తిథి సమయంలో సూర్యోదయానికి ముందే అంటే ఉదయం 8 గంటలలోపు పౌర్ణమి తిథి ముగుస్తుంది. ఆ వెంటనే పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 12న వ్రతం నిర్వహిస్తే అమావాస్య ముందు వచ్చే శుక్రవారం అవుతుంది.

​శుభ ముహుర్తం..

వరలక్ష్మీ వ్రతం పూజ నిర్వహించే శుభ ముహుర్త వివరాలిలా ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 6:14 నుండి ఉదయం 8:32 గంటల వరకు

మధ్యాహ్నం పూజా సమయం : 1:07 నుండి మధ్యాహ్నం 3:26 గంటల వరకు

సాయంత్రం పూజా ముహుర్తం 7:12 గంటల నుండి 8:40 గంటల వరకు

​ఏ శుక్రవారమైనా..

పండితుల లెక్కల ప్రకారం ఆగస్టు ఐదో తేదీన రెండో శుక్రవారం వస్తుంది. అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే అంటే ఇదే రెండో శుక్రవారం. ఈరోజునే వరలక్ష్మీ వ్రతం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో కుదరని వారు ఆగస్టు 12వ తేదీన కూడా చేసుకోవచ్చు. వాస్తవానికి శ్రావణ మాసంలో ఏ శుక్రవారం అయినా ఈ వ్రతాన్ని ఆచరించొచ్చు.

​తిరుచానూరులో..

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిధిలోని దేవాలయాల్లో ఆగస్టు ఐదో తేదీనే వరలక్ష్మీ వ్రతం వేడుకలను నిర్వహించనున్నారు. టిటిడి బోర్డు కూడా వరలక్ష్మీ వ్రతం పూజలకు సంబంధించిన టికెట్లను వెబ్ సైట్లో ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఆలయంలోని మండపంలో వ్రతం కోసం రూ.1,001 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రతం పూజలను నిర్వహించనున్నారు. అనంతరం స్వర్ణ రథంపై పద్మావతి అమ్మవారిని మాఢ వీధుల్లో ఊరేగించనున్నారు.

​లక్ష్మీదేవి అనుగ్రహం..

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, వ్రతానికి సంబంధించిన వివరాలను వివరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీ వ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలన్నీ తొలగిపోయి లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పింది. అప్పటినుంచి ఈ వ్రతాన్ని వివాహిత మహిళలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.