యాప్నగరం

వరలక్ష్మీ అలంకారంలో దుర్గమ్మ.. ఆన్‌లైన్ ద్వారా వ్రతంలో పాల్గొంటున్న భక్తులు

శ్రావణమాసంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. కానీ, ఏడాది భక్తులకు అనుమతిలేకుండా అన్ని ఆలయాలు ఏకాంతంగా వ్రతాలు నిర్వహిస్తున్నాయి.

Samayam Telugu 31 Jul 2020, 10:31 am
శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ దేవి అలంకారంలో విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు దేవస్ధానం ఆధ్వర్యంలో వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏటా నిర్వహించే సామూహిక, ఉచిత వరలక్ష్మీ దేవి వ్రతాలు, ఆర్జిత సేవలను దేవస్థానం అధికారులు రద్దు చేశారు.
Samayam Telugu వరలక్ష్మీ దేవిగా బెజవాడ దుర్గమ్మ
varalakshmi Vratham


భక్తులకు పూజల్లో పాల్గొనేందుకు దుర్గగుడి అధికారులు అనుమతి నిరాకరించారు. వరలక్ష్మీ వ్రతంలో భక్తులకు పరోక్ష పూజల ద్వారా గోత్రనామాలతో జరిపేందుకు మాత్రమే అవకాశం కల్పించారు. వరలక్ష్మీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు తరలివస్తున్నారు. ఇక, వరలక్ష్మీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను ఎమ్మెల్యే ఆర్కే రోజా, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట‌రమణ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రావణ శుక్రవారం.. ఈ రోజు వచ్చిందంటే ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. ప్రత్యేక కార్యక్రమాలు, భక్తుల రాకతో సందడిగా మారుతాయి. ఇక ఆ రోజున నిర్వహించే వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో విశిష్టమైనది. ఆలయాల్లో సైతం సామూహికంగా నిర్వహిస్తుంటారు. అమ్మను కొలిచి.. మొక్కులు చెల్లించుకుంటారు. ఇరుగుపొరుగు.. బంధువుల మధ్య ఘనంగా నిర్వహిస్తుంటారు. నోములు నోచుకొని వరాలు ఇచ్చే మాతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో సామూహిక వ్రత పూజలు సైతం చేపడుతుంటారు. కానీ ఈ సారి కొవిడ్‌-19 దీనికి పెద్ద అవరోధంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.