యాప్నగరం

లైఫ్‌లో సక్సెస్ కోసం వివేకానందుడి ఐదు సూత్రాలు

తన ప్రసంగాలతో పాశ్చాత్యులను ఆకట్టుకుని హిందూమత గొప్పదనాన్ని తెలియజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు.

TNN 23 Jan 2017, 7:08 pm
తన ప్రసంగాలతో పాశ్చాత్యులను ఆకట్టుకుని హిందూమత గొప్పదనాన్ని తెలియజేసిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానందుడు. భారతదేశ యువతకు ఉపన్యాసాలతో స్ఫూర్తినిచ్చి జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులకు యోగ, వేదాంత శాస్త్రాలను పరిచయం చేసిన ఖ్యాతి అతనిది. వ్యక్తి విజయవంతమైన జీవితం గడపడానికి ఐదు సూత్రాలను వివేకానందుడు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక భావనలతో వ్యక్తిలో నిస్వార్థమైన వైఖరులు అలవడుతాయని వివరించారు.
Samayam Telugu 5 secrets by vivekananda to lead a successful life
లైఫ్‌లో సక్సెస్ కోసం వివేకానందుడి ఐదు సూత్రాలు


సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.

సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ప్రతి అంశాన్ని గుర్తించుకుని వాటిని ఉపయోగించుకునే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. సృష్టిలో పనికారనిదంటూ ఏదీ ఉండదు. మనం చూసే విధానంలోనే తేడా ఉంటుంది. ఎవరి సామర్థ్యంపై వారికి నమ్మకం ఉండాలి. ఇతరులపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాలి.

తాము సంతోషంగా ఉండటమే కాకుండా చుట్టూ ఉన్నవారినీ ఆనందంగా ఉంచాలి. తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే కానుకలు, అభినందనలు, ఆశ్చర్యకర సందేశాల ద్వారా ఇతరులను సంతోష పెట్టేందుకు ప్రయత్నించాలి. అలాగే అవసరంలో ఉన్నవారికి సాయపడాలి. వారికి అవసరమైనప్పుడు ఆహారం లేదా నగదు ఇస్తే ప్రపంచంలో అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.

వ్యక్తుల అంతర్మాత ప్రకారం నడుచుకోవాలి. మనసు చెప్పినట్లు ధైర్యంగా ముందుకు సాగాలి. ఎవరి అంతరాత్మ వారిని మోసం చేయదు. ఒక వేళ సందిగ్థతలో ఉంటే ధ్యానం చేయడం ద్వారా సందిగ్ధత నుంచి బయటపడవచ్చు.

జీవితంలో ప్రతి అంశం ప్రేమతో ముడిపడి ఉంది. జీవితంలో నిజమైన ఆనందానికి ప్రేమ సహాయపడుతుంది. నిజమైన ప్రేమకు షరతులు ఉండవు, దానికి నటించడం కూడా సాధ్యం కాదు. ప్రేమ జీవితం...నిస్వార్థమైన జీవితం ప్రేమతోనే సాధ్యం...మరణం, ప్రేమకు అవినాభావ సంబంధం ఉంది. జీవించడానికి ఊపిరి ఎంత అవసరమో, అర్థవంతమైన జీవితానికి ప్రేమ కూడా అంతే అవసరం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.