యాప్నగరం

అచలేశ్వరాలయంలో 'మహా'ద్భుత శివలింగం!

దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ మందిరం' ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Samayam Telugu 28 Mar 2018, 12:03 pm
దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న'అచలేశ్వర మహాదేవ మందిరం' ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు.. రంగులు మారుతూ... అందర్నీ.. ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. దీనికితోడు ఈ శివలింగం పక్కకు కదులుతుంటుంది. ఈ విచిత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు... భక్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తుంటారు.
Samayam Telugu Achaleshwaram1

ఇక్కడి శివాలయంలో ఇత్తడితో తయారుచేసిన 'నంది' మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పంచలోహాలతో దీన్ని తయారు చేశారు. ఈ శివలింగం ఇలా రంగులు మారుతూ, కదలడానికి గాల కారణాలను తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ... ఫలితం సాధించలేకపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.