యాప్నగరం

అనంత పద్మనాభుడి విలువైన వజ్రాలు చోరీ

అపారమైన సంపదలతో వార్తల్లో నిలిచిన అనంతపద్మనాభుడి ఆలయంలో విలువైన వజ్రాలు చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది.

TNN 5 Jul 2017, 12:22 pm
2011లో అపారమైన నిధి నిక్షేపాలు వెలుగుచూడటంతో దేశంలో అత్యంత విలువైన సంపద కలిగిన ఆలయంగా తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. అయితే అనంత పద్మనాభస్వామి ఆలయంలో అత్యంత విలువైన 8 పురాతన వజ్రాలు మాయమైనట్లు దేవస్థానం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వామివారి విగ్రహానికి తిలక ధారణ కార్యక్రమంలో నిత్యమూ జరిగే అనుష్ఠానానికీ వినియోగించే వజ్రాలు చోరీకి గురైన విషయాన్ని దేవాలయం తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యం సుప్రీంకోర్టుకు, కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఆలయ మాజీ ఈఓ కేఎన్ సతీశ్ రికార్డుల్లోనూ నమోదు చేశారని తెలిపారు. అత్యంత విలువైన ఈ వజ్రాలు 2015లో మాయమైతే, 2016లో ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు.
Samayam Telugu after gold worth rs 189 cr antique diamonds missing from kerala temple sc told
అనంత పద్మనాభుడి విలువైన వజ్రాలు చోరీ


చోరీకి గురైన వజ్రాల విలువ అధికారింగా రూ.21 లక్షలు ఉంటుందని అంచనావేసినా, బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.1.5 కోట్లు ఉంటుంది. వీటితోపాటు గతేడాది నిర్వహించిన ఆడిట్‌లో రూ. 189 కోట్ల విలువైన 769 కిలోల బంగారు బిందెలు కూడా మాయమైనట్లు అధికారులు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతవరకూ దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా వెలుగొందిన తిరుమల వెంకటేశ్వరుడు మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల సంపద పద్మనాభుడి నేలమాళిగల్లో బయటపడటంతో రెండో స్థానానికి పడిపోయాడు. వీటితోపాటు నేలమాళిగలోని ఆరోగదిలోనూ సంపద లెక్కిస్తే దీనికి రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు. నాగబంధం, అతీంద్రియ శక్తులు ఆరో గదికి రక్షణగా ఉన్నాయని, దీన్ని తెరిస్తే అనేక విపత్కర పరిణామాలు చోటుచేసుకుంటాయని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.