యాప్నగరం

భక్తుడి కోసం దిశనే మార్చుకున్న ఆలయం!

భగవంతుడు భక్తులను పరీక్షిస్తాడని అంటారు. తనపై అపార భక్తి కలిగిన వారిని ఇంకా పరీక్షించి వారి గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడానికి భగవంతుడు ఆడే వింత నాటకం.

TNN 18 Aug 2017, 4:17 pm
భగవంతుడు భక్తులను పరీక్షిస్తాడని అంటారు. తనపై అపార భక్తి కలిగిన వారిని ఇంకా పరీక్షించి వారి గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడానికి భగవంతుడు ఆడే వింత నాటకం. ఇలాంటి ఘటనలు మన పురణేతిహాసాల్లో కోకొల్లుగా ఉన్నాయి. కనకదాసుని భక్తివల్ల శ్రీకృష్ణుడు తన దిశ మార్చుకున్న సంఘటన ఉడుపి ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. అలాగే శివుడు కూడా తన భక్తుడికి దర్శన భాగ్యం కలిగించడానికి తన దిక్కునే మార్చుకున్న దేవాలయం మహారాష్ట్రలో ఉంది. అందే అమరేశ్వరాలయంగా విరాజిల్లుతున్న అంబరనాథ్ దేవాలయం. అంబరనాథ్ దేవాలయం మహారాష్ట్రలో ఉంది. దీన్ని అంబ్రేశ్వర శివ దేవాలయమని కూడా పిలుస్తారు.
Samayam Telugu ambarnath temple change his dirction for devotee
భక్తుడి కోసం దిశనే మార్చుకున్న ఆలయం!


పాండవుల వనవాస సమయంలో ఈ అంబరానాథ్ దేవాలయాన్ని నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయంలో పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఈ లింగం అనంత ఆకాశ లింగమని పాండవులు గుర్తించారు. అందుకే దీని గర్భగుడి పైకప్పు నిర్మాణం కూడా లేదు. అయితే ఈ ఆలయాన్ని 1060 లో పునర్నిర్మించారు. ఉత్తర భారతాన్ని పాలించిన శిలాహార రాజవంశానికి చెందిన చిత్తరాజా ఈ దేవాలయాన్ని మొట్టమొదటి సారిగా పునరుద్దరించాడు.పూర్వ కాలంలో మేలు జాతి, కడ జాతి అనే కులాలు ఉండేవి. కడజాతి వారిని సమాజంలో హీనంగా చూసేవారు. అప్పట్లో అంబరనాథ్ దేవాలయంలోకి దళితులకు ప్రవేశం నిషేధం. అయితే పరమశివభక్తుడైన ఓ దళితుడు స్వామి దర్శనానికి వెళ్లాడు. నిమ్న కులస్థుడు కావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని, ఆలయ ఉత్తర దిక్కునకు నెట్టివేశారు.

దీంతో ఆవేదన చెందిన ఆ భక్తుడు అక్కడే నిలబడి పరమశివుడిని ప్రార్థించాడు. అతడి భక్తికి స్వామి వారు తన దిశను మార్చుకున్నారు. తూర్పు దిక్కు నుంచి ఉత్తరానికి తిరిగిపోయారు. మహాభక్తుడి కోసం తన దిక్కునే మార్చుకున్న ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించారు. ఈ దేవాలయాన్ని అభివృద్ది చేయడానికి వచ్చిన ముమ్ముని గర్భగుడిలో వున్న స్వామి తూర్పు దిక్కున ఉంటే,అయితే ప్రవేశద్వారం ఉత్తరదిక్కులో ఉండటం గమనించినాడు. దేవాలయం తన స్థితిని మార్చుకున్నందు వల్ల తూర్పున ఉన్న నందికి ఎలాంటి మండపం లేదు. అలాగే వాస్తు దోష నివారణకు ఉత్తర దిక్కుకు జతగా తూర్పు, దక్షిణ ద్వారాల వైపున కూడా మండపాలను నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.