యాప్నగరం

Ayudha Pooja దసరాకు ముందు ఆయుధ పూజ చేస్తే అన్నింటా విజయాలే...!

Ayudha Pooja హిందూ పంచాంగం ప్రకారం నవరాత్రులు ముగిసిన వెంటనే దశమి రోజున విజయదశమి(దసరా) పండుగను జరుపుకుంటారు. అయితే అంతకంటే ముందు దుర్గాష్టమి రోజున లేదా మహా నవమి పర్వదినాన ఆయుధ పూజలు కూడా చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం, లంకాధిపతి రావణాసురుడిని వధించేముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించాడు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 4 Oct 2022, 2:03 pm
Ayudha Pooja హిందూ పంచాంగం ప్రకారం నవరాత్రులు ముగిసిన వెంటనే దశమి రోజున విజయదశమి(దసరా) పండుగను జరుపుకుంటారు. అయితే అంతకంటే ముందు దుర్గాష్టమి రోజున లేదా మహా నవమి పర్వదినాన ఆయుధ పూజలు కూడా చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం, లంకాధిపతి రావణాసురుడిని వధించేముందు శ్రీరాముడు కూడా తన ఆయుధాలను పూజించాడు. పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేసినట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా ఆయుధ పూజలను మహా నవరాత్రుల్లోనే ఎందుకు చేస్తారు.. వాటి ప్రాముఖ్యత ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Ayudha Pooja


ప్రస్తుతం చాలా మంది రకరకాల పనుల్లో బిజీగా ఉంటారు. అలాంటి వారు నవరాత్రులలో అన్ని రోజులూ పూజలు చేయలేనివారు చివరి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని దేవీ భాగవతంలో పేర్కొనబడింది. అందుకే సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి రోజులు త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర మర్దినిగా రాక్షసుడి వధించి, విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునే వారని పురాణాల్లో పేర్కొనబడింది. తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు. దుర్గాష్టమి, విజయదశమిలాగే ‘మహర్నవమి’ కూడా దుర్గా మాతకు విశేషమైన రోజు.

October Born People అక్టోబరులో పుట్టిన వారు ఆ విషయంలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటారట...!

కొందరు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహర్నవమి నాడు ముక్తేశ్వరీ దేవిని పూజిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఉత్తర భారతంలో మహా నవమి రోజున కన్య పూజలు నిర్వహిస్తారు.

నవరాత్రుల చివరి రోజున తొమ్మిది మంది కన్యా రూపాలు సంకేత పూర్వకంగా ప్రాతినిధ్యం వహించే శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహా నవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతీ పూజ చేస్తారు. అనంతరం బతుకమ్మ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

మరోవైపు తమ పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు కఠోర తపస్సు తచేసి గంగమ్మ తల్లిని నింగి నుంచి నేలకు రప్పించింది కూడా ఈరోజే. అందుకే నవరాత్రుల్లో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
ఆయుధ పూజ రోజున కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలకు కచ్చితంగా పూజలు చేస్తారు. ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటామని, తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలా మంది నమ్ముతారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.