యాప్నగరం

'కోటీ దీపోత్సవం'లో ప్రముఖుల సందడి

కార్తిక మాసం పర్వదినాల సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా, వేడుకగా...

Samayam Telugu 14 Nov 2016, 8:19 am
కార్తిక మాసం పర్వదినాల సందర్భంగా భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా, వేడుకగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఈ అపూర్వ ఘట్టానికి వేదికగా నిలిచింది. వివిధ పీఠాధిపతులు, వేద పండితుల సమక్షంలో ఆ మహా దేవునికి జరుగుతున్న కోటి దీపోత్సవం కన్నుల పండువని తలపిస్తోంది. మరోవైపు భక్తులని అలరించేలా అనేక సాంస్కృతి కార్యక్రమాలు, విభిన్నమైన కళారూపాల ప్రదర్శనలు కోటి దీపోత్సవానికి మరో ప్రత్యేకతగా నిలిశాయి.
Samayam Telugu bhakti tvs koti deepostavam celebrations
'కోటీ దీపోత్సవం'లో ప్రముఖుల సందడి


నవంబర్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో విధమైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటున్నాయి.

నవంబర్ 12న జరిగిన ప్రత్యేక పూజల్లో గవర్నర్ నరసింహన్ దంపతులు, నవంబర్ 13న జరిగిన ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ఆ మహాశివుడిని దర్శించుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.