యాప్నగరం

మే 1న శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి జన్మదిన వేడుకలు

ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి 78వ జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్, స్ఫూర్తి నగర్‌లో ఉన్న ‘విశ్వ చైతన్య వేదిక’లో ఈ వేడుకలను నిర్వహిస్తారు.

Samayam Telugu 29 Apr 2018, 1:11 pm
ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సెయింట్ శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి 78వ జన్మదిన వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్, స్ఫూర్తి నగర్‌లో ఉన్న ‘విశ్వ చైతన్య వేదిక’లో ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మహాప్రసాదం వరకు ఈ వేడుకలు జరుగుతాయి. శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి గురు దేవుల ప్రసంగంతో ఈ వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం సామూహిక ధ్యానం ఉంటుంది.
Samayam Telugu vishwa guru spoorthi


జన్మదిన వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పుస్తక ప్రదర్శనతోపాటు పేదలకు వస్త్రాలను దానం చేస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని సైన్స్ యూనివర్స్ అధ్యక్షులు ఎస్. రాజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని గురుదేవుల ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.