యాప్నగరం

ఉగాది పచ్చడి తొలిజాములో తీసుకోవడం వల్ల...

ఉగాది రోజు సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి మామిడాకులు తోరణాలు కట్టి, రంగవల్లులతో అలంకరించుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి ముందుగా గణపతిని పూజించి తర్వాత ఇష్టదేవతలను ఆరాధించాలి.

TNN 29 Mar 2017, 6:49 am
ఉగాది రోజు సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి మామిడాకులు తోరణాలు కట్టి, రంగవల్లులతో అలంకరించుకోవాలి. బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి ముందుగా గణపతిని పూజించి తర్వాత ఇష్టదేవతలను ఆరాధించాలి. సరస్వతి, బ్రహ్మ, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు అష్ట దిక్పాలకులను, నవగ్రహాలను అర్చించాలి. ఆపై పంచాంగాన్ని పూజించి పండితుడి ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి.
Samayam Telugu celebrations of ugadi festival
ఉగాది పచ్చడి తొలిజాములో తీసుకోవడం వల్ల...


కొత్త సంవత్సర ఆరంభంలో గ్రహ, నక్షత్ర, వారాలను అనుసరించి కాలానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం తర్వాత ఉగాది పచ్చడిని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. వేపపువ్వు, మామిడికాయ, బెల్లం, ఉప్పు, చింతపండు షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. దీనిని మొదటి జాములోనే అంటే ఉదయం 8.30 నుంచి 9.00 గంటల మధ్య తీసుకోవాలని పంచాంగ నిపుణులు అంటున్నారు.

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింబకం దళబక్షణం ఈ మంత్రాన్ని ఉగాది రోజున పఠించడం ద్వారా సకలసంపదలతోపాటు మనసులోని కోరికలు నెరవేరుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఉగాది రోజు తెల్లవారి 6 గంటల నుంచి 9 లోపు పూజ చేయడం ఉత్తమం. ఉగాది మనకు హిందువులకు సంవత్సరాది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేయడం ముఖ్యమైన విధి. ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ నవరాత్రులలో దేవిని ఉపాసిస్తారు. అభ్యంగన స్నానం తర్వాత కొత్త వస్త్రాలు ధరించి, పూజచేసి పంచాగ శ్రవణం, ఉగాది పచ్చడి తీసుకోవాలి.

అలాగే ఉగాది రోజు ఇంతకుముందు దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లాలి. ఆలయాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం లేదా శక్తి పూజ చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

ఆలయాల్లో పంచాంగ శ్రవణం. అలాగే వసంత నవరాత్ర ఉత్సవాలు జరిపించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గోచార ఫలితాలపై పండితులతో ఉపన్యాసాలు ఇప్పిస్తే మంచిది. ఇంకా ఉగాది రోజు శ్రీరాముడిని స్మరిస్తే శుభం కలుగుతుందిటాయి. కాబట్టి శ్రీరామ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.