యాప్నగరం

పురుషుడికి స్త్రీ విషంతో సమానమయ్యే సందర్భం ఇది!

స్త్రీ, పురుషులు ఒకరిపై మరొకరు ఆధారపడి జీవిస్తారు. ఆ మాటకొస్తే మగవారే ఎక్కువగా స్త్రీలపై ఆధారపడతారు. మరి స్త్రీ పురుషుడికి ఏ సందర్భంలో విషంగా మారుతుందో తెలుసా?

TNN 20 Nov 2016, 9:41 am
స్త్రీ కారణంగా పురుషుడు అనేక రకాల ప్రయోజనాలు పొందుతాడు. జన్మనివ్వడం దగ్గర నుంచి ఓ సోదరిగా, భార్యగా, కూతురుగా పురుషుడి జీవితంలో మహిళ పాత్ర వెలకట్టలేనిది. అలాంటి స్త్రీ కూడా పురుషుడికి విషతుల్యమయ్యే సందర్భం ఒకటుంది. ఆ సందర్భాన్ని చాణక్యుడు తన చాణక్య నీతిలో ప్రస్తావించాడు. అదేంటో తెలుసా?
Samayam Telugu chanakya niti only time when a woman becomes poison in mans life
పురుషుడికి స్త్రీ విషంతో సమానమయ్యే సందర్భం ఇది!


వృద్ధాప్యానికి చేరువగా ఉన్న పురుషుడు యవ్వనంలో ఉన్న స్త్రీని పెళ్లాడితే ఆ వివాహం అతడికి విషంతో సమానం అవుతుంది. వివాహ బంధం అనేది తక్కువ వయోబేధం లేదా సమ వయస్కుల మధ్య జరగాలి. అప్పుడే వారి మధ్య చక్కటి అవగాహన ఉండటంతోపాటు ఒకరిని మరొకరు మెప్పించగల్గుతారు. అంతేగానీ ఎక్కువ వయసు తేడా ఉన్న అమ్మాయిని పెళ్లాడితే వారి జీవితం నరకప్రాయం అవుతుంది. వయసులో చాలా అంతరం ఉన్న అమ్మాయిని పెళ్లాడినా లేదా ఆమెతో సంబంధాలు పెట్టుకున్నా.. మీ కుటుంబం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని చాణక్యుడు చెప్పాడు. ఆమె ఆశలను నెరవేర్చలేకపోవడంతో వివాహ జీవితంలో ఎడతెగని సమస్యలు వస్తాయని చెప్పాడు. తన వయసున్న వ్యక్తితో ఆమె వెళ్లిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చని హెచ్చరించాడు.

చాణక్యుడి కాలంలో భారీ వయసు తేడాతో వివాహాలు జరగడం అనేది సాధారణంగా ఉండేది. అందుకే ఆ మహిళలు ఎదుర్కొనే బాధను దృష్టిలో ఉంచుకొని చాణ్యకుడు ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నేటికీ కొన్ని చోట్ల ఇలాంటి వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మరీ వయసు తేడా ఉన్న అమ్మాయిని పెళ్లాడకపోవడమే ఉత్తమం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.