యాప్నగరం

కార్తీకంలో శివుడికి ఆవు నేతితో దీపం వెలిగిస్తే..

స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలను తొలగించి, అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం.

TNN 27 Oct 2017, 6:54 pm
కార్తీకం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలను తొలగించి, అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకం. ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆథ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీక మాసం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైంది. ఈ మాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలలో చేరుతుంది. ఆ సమయంలో ఈ జలాల్లో విష్ణువు వ్యాపించి ఉంటాడు కాబట్టి కార్తీకస్నానం చేసినవారికి పుణ్యం ప్రాప్తిస్తుంది. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని విశ్వాసం. స్త్రీ, పురుషులు కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలని పండితులు తెలియజేస్తున్నారు.
Samayam Telugu cow ghee diya to shiva in auspicious month of kartik
కార్తీకంలో శివుడికి ఆవు నేతితో దీపం వెలిగిస్తే..


కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయం, వైష్ణవ ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల కష్టాలు తొలగడమే కాకుండా అనంతమైన ఫలాలు లభిస్తాయి. శివాలయ గోపుర ద్వారం, శిఖరం, శివలింగ సన్నిధిలోగానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించి పోతాయి. కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీపారాధన ఎవరు చేస్తారో, వారు అత్యంత పుణ్యాత్ములవుతారు. నెల పొడవునా చేసినవాళ్లు జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని శివ పురాణంలో తెలిపారు. పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కార్తీకవ్రతం వల్ల హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఆహారం స్వీకరించి, భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.