యాప్నగరం

ద్రౌపది 13 ఏళ్లు తన జుత్తు ఎందుకు ముడివేయలేదంటే?

మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. ఇందులోని ఎన్నో రహస్యాలు నేటికీ అంతుబట్టవు. భారతంలో పాండవులకు ఎంత ప్రాధాన్యత ఉందో, ద్రౌపది ప్రభావం కూడా అంతేస్థాయిలో ఉంది.

TNN 17 Mar 2017, 4:27 pm
మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. ఇందులోని ఎన్నో రహస్యాలు నేటికీ అంతుబట్టవు. భారతంలో పాండవులకు ఎంత ప్రాధాన్యత ఉందో, ద్రౌపది ప్రభావం కూడా అంతేస్థాయిలో ఉంది. ఎందుకంటే భారత యుద్ధానికి ఓ రకంగా మూల కారణం ఈమే. నిండు సభలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తించుకోవడమే కాదు, పాండవుల్లో ప్రతీకార జ్వాలను రగిలించింది. అందుకే ద్రౌపదిని అత్యంత సమస్యాత్మక మహిళగానూ, భార్యగానూ పేర్కొంటారు.
Samayam Telugu draupadi did not tie her hair for 13 years what happened
ద్రౌపది 13 ఏళ్లు తన జుత్తు ఎందుకు ముడివేయలేదంటే?


అందంలోనూ తనకు తానే సాటి. అందమైన, పొడుగునై శిరోజాలు ఈమె సొంతం. అయితే మాయాజూదంలో ధర్మరాజు తాను ఓడిపోవడమే కాదు సోదరులు, రాజ్యాన్ని, ద్రౌపదిని కూడా పోగొట్టుకుంటాడు. ఈ ఓటమి తర్వాత ద్రౌపది తమ బానిస కాబట్టి ఆమెను సభలోకి తీసుకురమ్మని దుర్యోధనుడు ఆఙ్ఞాపిస్తాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ద్రౌపదని నిండు సభలోకి ఈడ్చుకొస్తాడు.

ప్రస్తుతం మాకు బానిసవు, ఎవరికీ దీనిపై ఫిర్యాదు చేసే హక్కు నీకు లేదంటూ ఆమె మేలి ముసుగు తొలగించి దుశ్శాసనుడు అవమానిస్తాడు. ఇంతటితో ఆగకుండా దుర్యోధనుడు తన తొడపై కూర్చోమని ఆహ్వానిస్తాడు. ఈ ఘోరం నుంచి రక్షించమని పాండవుల వంక దీనంగా చూసి అర్థించినా వారు నిస్సహాయులై ఏమీ చేయలేరు. దీంతో కృష్ణుడు ద్రౌపదిని రక్షిస్తాడు. ఈ పరాభవానికి గుర్తుగా తన శిరోజాలను నూనె రాయనని, అలాగే ముడివేయనని కురు సభలోనే శపథం చేసింది.

ఎవరైతే తనను నిండు సభలో అవమానించారో వారి రక్తంతోనే తన శిరోజాలను తడిపినంతవరకు వాటిని ముడివేసుకోనని తెలిపింది. ఆ తర్వాత భీముడు యుద్ధంలో దుశ్శాసనుడి రక్తం తాగి, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి తెస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు. జత్తును ముడివేయకుండా అలా 13 ఏళ్ల పాటు ద్రౌపది ఎదురు చూసింది. కురుక్షేత్ర సంగ్రామంలో భీముడు తన శపథాన్ని నెరవేర్చాడు. దుశ్శాసనుడిని చంపి అతని రక్తం తీసుకొచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. దుశ్శాసనుడి రక్తాన్ని తన జట్టుకు రాసిన తర్వాతే ఆమె వాటిని ముడివేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.