యాప్నగరం

వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తే.....

వారంలోని ఏడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంది. హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు.

TNN 25 Apr 2017, 5:35 pm
వారంలోని ఏడు రోజులకు ఒక్కో ప్రత్యేకత ఉంది. హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు. కాబట్టి ఆ రోజుకు అధిపతైన దేవుడిని పూజిస్తే కార్యసిద్ధి,అనుగ్రహం లభిస్తాయి. సోమవారం అంటే శివుడికి ఎంతో విశిష్టమైన రోజు. ఆ రోజున పాలు, బియ్యం, బెల్లంతో తయారుచేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించి, పూజిస్తే మహాశివుడి అనుగ్రహం పొందవచ్చు.
Samayam Telugu each day of a week dedicated to a particular hindu god
వారంలోని ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తే.....


ఇక మంగళవారం నాడు ఆంజనేయుడినితోపాటు దుర్గాదేవిని కూడా ఆరాధించవచ్చు. ఆ రోజున రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ చెక్కలో దీపం వెలిగించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. బుధవారం వినాయకుడిని పూజించాలి. గరిక పూసలను గణనాథుడికి సమర్పిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి. గురువారం విష్ణుమూర్తి, సాయిబాబా, లక్ష్మీదేవి, రాఘవేంద్ర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలను వస్తాయి. ఇంకా దక్షిణామూర్తిని కూడా పూజిస్తే దోషాలు తొలగిపోతాయి.

శుక్రవారం దుర్గాదేవి, రాజరాజేశ్వరిని కొలిస్తే అష్టైశ్వర్యాలు, విజయాలు సొంతమవుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ఇక శనివారం రోజున శనీశ్వరుడి ముందు దీపం వెలిగించాలి. ఆంజనేయుడు, కాళీమాతను కూడా పూజించవచ్చు. ఆదివారం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడిని స్మరించుకోవాలి. సూర్య దోషం ఉన్నవాళ్లు ఆదివారం నాడు సూర్యుడిని ప్రార్థిస్తే తొలగిపోతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.