యాప్నగరం

అనుకోని ప్రమాదాల నుంచి బయటపడాలంటే..

జీవితంలో కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు, సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే అలాంటి వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా ఉంటాయి.

TNN 28 Dec 2016, 7:03 pm
జీవితంలో కొన్నిసార్లు అనుకోని అవాంతరాలు, సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే అలాంటి వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా ఉంటాయి. ఏదైనా పని ప్రారంభించినపుడుగానీ, ప్రయత్నించినపుడుగానీ ఎదురైన అడ్డంకులను తొలగించుకోడానికి ఈ కింది వాటిని పాటిస్తే వాటి నుంచి సులభంగా బయట పడవచ్చు.
Samayam Telugu following these things solved unexpected barriers
అనుకోని ప్రమాదాల నుంచి బయటపడాలంటే..


మంగళవారం అభయాంజనేయ దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామి చేతికున్న సిందూరాన్ని తీసుకుని ముఖం, చేతులు, హృద‌యానికి పూసుకోవాలి. ఆ తర్వాత ఈ కింది మంత్రాన్ని జపించాలి. 'ఓం అజంనీ సుతాయ విద్మహే వాయు పుత్రాయ దీమహి తన్నో మారుతీ ప్రచోదయాత్' అంటూ 21 సార్లు పఠించాలి.

దూరపు ప్రయాణాలు, తీర్థ యాత్రలకు వెళ్లేటప్పుడు ఊహించని ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఓ కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని తలపై చల్లుకోవాలి. అంతే కాకుండా ప్రసాదాన్ని ఇతరులకు పంచి తాను కూడా భుజించాలి.

కొత్తగా వాహనాలు కొన్నవారు ప్రమాదాల నుంచి బయట పడటానికి ఎర్రని వస్త్రంలో ఎనిమిది ఖర్జూర ఫలాలను వేసి మూటగట్టి దానికి ఆ వాహనానికి ముందు కట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.