యాప్నగరం

పూజలో అగరువత్తి వెలిగించడం వెనుక శాస్త్రీయ దృక్ప‌థం!

పూజా సమయంలోనూ, మత కార్యక్రమాలు, ధ్యానం చేసేటప్పుడు అగరువత్తులు, దూపం వెలిగించడం అనే సంప్రదాయాన్ని తర తరాలుగా అనుసరిస్తున్నారు.

TNN 7 Mar 2017, 4:22 am
పూజా సమయంలోనూ, మత కార్యక్రమాలు, ధ్యానం చేసేటప్పుడు అగరువత్తులు, దూపం వెలిగించడం అనే సంప్రదాయాన్ని తర తరాలుగా అనుసరిస్తున్నారు. అగరుపొగలు లేదా సుగంధం పరిమళం వల్ల గదిలో సువాసన వ్యాపిస్తుందని అనుకుంటాం. అయితే ఈ పురాతన సంప్రదాయంలో ఓ శాస్త్రీయ దృక్ప‌థం ఉంది. పూర్వ కాలం అగరువత్తుల్లో అనేక ఔషధ గుణాలు ఉండేవి.
Samayam Telugu heres the scientific reason behind burning incense sticks during puja
పూజలో అగరువత్తి వెలిగించడం వెనుక శాస్త్రీయ దృక్ప‌థం!


వీటిలో ప్రత్యేకత సంతరించుకున్న సాంబ్రాణి, గుగ్గిలంను ప్రస్తుతం కూడా ఉపయోగిస్తున్నారు. బోస్వెల్లియా చెట్టు ద్రావకం నుంచి సాంబ్రాణి ఉత్పత్తి అవుతుంది. దీన్ని దూపంగా వేసినప్పుడు వెలువడే వాసనతో మెదడులోని టీఆర్పీవీ3 ప్రొటీన్ ఉత్తేజితమై మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే చర్మానికి కూడా స్వాంతన చేకూర్చుతుంది.

గుగ్గిలం ప్రయోజనాలను గురించి అథర్వణ వేదంలో వివరించారు. మండు వేసవిలో గుగ్గిలం వృక్షం నుంచి వెలువడే శ్రావకాల రసాయనాలను దూపానికి వాడతారు. దీని నుంచి వచ్చే దూపానికి క్రిమిసంహారక, రక్తస్రావ లక్షణాలును నిరోధించే గుణాలు ఉన్నాయి. అలాగే చుట్టూ ఉండే గాలిని కూడా శుభ్రపరుస్తుంది. గుగ్గిలం దూపం వేసేటప్పుడు వెలువడే సువాసన మానసిక ప్రశాంతతను కలిగించి ఏకాగ్రతకు దోహదం చేస్తుంది.

అందుకే వీటిని పూజా సమయంలో వెలిగిస్తారు. వీటి వల్ల ఇంటిలోని ఏమైనా ప్రతికూలతలు ఉంటే అనుకూలంగా మారతాయి. అయితే ఎల్లప్పుడూ నాణ్యమైన అగరువత్తులు, సాంబ్రాణి, గుగ్గిలం మాత్రమే ఉపయోగించాలి. కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన నాసిరకమైనవి ఆరోగ్యానికి మరింత చేటు కలిగిస్తాయి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి, రక్తంలోని కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వాయువులు కూడా పెరుగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.