యాప్నగరం

20 రోజుల్లో 2600 కిలోమీటర్లు నడవడం సాధ్యమేనా?

రావణుడిని సంహరించి, లంకలో బంధీగా ఉన్న సీతను విడిపించిన రాముడు, పద్నాలుగేళ్ల తర్వాత అయోధ్యకు వచ్చిన సందర్భంగా తొలిసారి దీపావళి పండుగ జరుపుకున్నారనే కథనం కూడా ప్రచారంలో ఉంది.

TNN 19 Oct 2017, 5:23 pm
రావణుడిని సంహరించి, లంకలో బంధీగా ఉన్న సీతను విడిపించిన రాముడు, పద్నాలుగేళ్ల తర్వాత అయోధ్యకు వచ్చిన సందర్భంగా తొలిసారి దీపావళి పండుగ జరుపుకున్నారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. క్రీస్తు పూర్వం 7292 ప్రాంతంలో ఇది జరిగినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. దుర్గాదేవి అనుగ్రహంతో రాక్షస రాజు రావణ బ్రహ్మను వధించిన రాముడు, తర్వాత భారతదేశానికి చేరుకున్నాడు. అయితే, లంక నుంచి 2,600 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు గుర్రపు బండి, కాలినడక సాయంతో కేవలం 20 రోజుల్లో చేరుకున్నాడని చెబుతారు. ఎలాంటి ప్రయాణ సదుపాయాలు లేని ఆ కాలంలో వేల కిలోమీటర్ల దూరాన్ని 20 రోజుల్లో పూర్తిచేయడం మానవులకు సాధ్యంకాదు.
Samayam Telugu how did lord ram complete the journey of 2600km from sri lanka to ayodhya in just 20 days
20 రోజుల్లో 2600 కిలోమీటర్లు నడవడం సాధ్యమేనా?


అంత తక్కువ సమయంలో రాముడు అయోధ్యకు ఎలా చేరుకున్నాడనేది ఆధుని చరిత్రకారులు, పండితులకు ఓ పజిల్‌గా నిలిచిపోయింది.
గూగుల్ మ్యాప్‌ను ప్రామాణికంగా తీసుకుంటే రాముడు గంటకు 9 కిలోమీటర్ల వేగంతో, రోజుకు సగటును 130 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తేనే 20 రోజుల్లో 2,600 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలడు. రాముడిని ఇప్పుడు దైవంగా పరిగణిస్తున్నప్పటికీ మానవ రూపంలోనే ఉన్నారు. అయితే మానవులకు ఇది అసాధ్యం. ఒకవేళ గుర్రంతో వచ్చాడనుకుంటే అవి రోజుకు సగటున 50-60 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాయి, ఇలా కూడా సాధ్యం కాదు.

ఒకవేళ అయోధ్య రాజు, రావణునిపై విజయం సాధించిన గొప్ప యోధుడు అయిన రాముడు దగ్గర రోజుకు 100 కి.మీ. వరకు ప్రయాణం చేయగలిగిన కొన్ని అరుదైన ఉన్న గుర్రాలను ఉన్నా, కానీ రోజులో కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు ఇదేలా సాధ్యమవుతుంది. కానీ హిందూ పురాణాల్లో పుష్పక విమానాలు గురించి పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే సాంకేతిక పరిఙ్ఞానంలో భారత్ ముందున్నట్లు పుష్పక విమానాన్ని ఉదాహరణగా చెబుతున్నా, దీనికి సరైన ఆధారాలు లేవు.

దేవశిల్పి విశ్వకర్మ ఈ విమానాన్ని రూపొందించి బ్రహ్మదేవుడికి అందించారు. ఆ తర్వాత బ్రహ్మ దీనిని సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి అందజేశారు. అయితే లంకలో ఉండే కుబేరుని ఓడించిన రావణుడు ఈ విమానాన్ని సొంతం చేసుకున్నాడు. రావణ సంహారం తర్వాత పుష్పక విమానంపైనే రాముడు అయోధ్యకు చేరుకుని ఉంటాని కొందరు అభిప్రాయం. అంత దూరాన్ని 20 రోజుల్లో చేరుకోవడం దీని వల్లే సాధ్యమని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.