యాప్నగరం

ఇలా చేస్తే శ్రీవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది

చరిత్రకు దొరికినంత వరకు తిరుమలకు సంబంధించిన తొలి ప్రస్థావన తొల్కాపియమ్ అనే తమిళ గ్రంథంలో ఉంది. తమిళ వ్యాకరణమైన తొల్కాపియమ్ సుమారు 2 వేల ఏళ్లకు పూర్వం రాయబడింది.

TNN 15 Sep 2017, 6:33 pm
చరిత్రకు దొరికినంత వరకు తిరుమలకు సంబంధించిన తొలి ప్రస్థావన తొల్కాపియమ్ అనే తమిళ గ్రంథంలో ఉంది. తమిళ వ్యాకరణమైన తొల్కాపియమ్ సుమారు 2 వేల ఏళ్లకు పూర్వం రాయబడింది. అంతేకాదు తొలి సాహిత్యం కూడా ఇదే. ఈ వ్యాకరణ గ్రంథంలో తిరుమలను వేంగడం అని సంబోధించారు. వేంగడం అనే పదానికి తమిళ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దు అని అర్థం. తమిళ రాష్ట్రానికి తిరుమల కొండలు ఉత్తర సరిహద్దుగా ఉండేవి. ఈ వేంగడమే వెంకటంగా మారింది. వేంగడం కొండల్లోని దేవుడు వేంకటేశ్వరుడు అయ్యాడు. వేంకటేశ్వరస్వామి అనే పేరు ఇలానే వచ్చిందని పురాణాలు పేర్కొంటున్నాయి. 1944లో అప్పటి బ్రిటీష్ పాలకులు తిరుమల కొండకు ఘాట్ రోడ్డు నిర్మించారు. కానీ రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించింది మన తెలుగు వాడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
Samayam Telugu how pray lord venkateswara and getting his blessings
ఇలా చేస్తే శ్రీవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది


అంతకు ముందు క్రూర జంతువులు, దొంగల బారి నుంచి అతికష్టం మీద తప్పించుకుంటూ కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకునేవారు. అప్పట్లోనే కాలిబాటలు నాలుగు ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం మూడే మిగిలాయి. తిరుపతి నుంచి అలిపిరి కాలిబాట, చంద్రగిరి నుంచి శ్రీవారిమెట్టు, మామండూరు నుంచి అన్నమయ్య కాలిబాట. అన్నింటిలోకి ముఖ్యమైంది అలిపిరి కాలిబాటే. అలిపిరి నడకదారిలోనే వెయ్యి సంవత్సరాల కిందట రామానుజాచార్యులు మోకాళ్లతో కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.

శైవులు ఆక్రమించుకున్న తిరుమల కొండను తిరిగి వైష్ణవ క్షేత్రంగా మార్చింది రామానుజులే. అలిపిరి అంటే అందరికీ తెలుసు. అయితే పాదాల మండపం కొద్దిగా ముందుకు రాగానే ఒక శిల్పం కనిపిస్తుంది. ఆ రోజుల్లో దాసరులు అనబడే వైష్ణవులు భిక్షాటన చేస్తూ జీవించేవారు. దాసరి అంటే వెనుకబడిన కులంలో జన్మించి వైష్ణవుడిగా మారిన వ్యక్తి. దాసరి అంటే విష్ణుదేవుడి దాసుడు. అలాగే వెనుకబడిన కులాల్లో పుట్టిన వారిలో చాలామందిని వీరశైవం ఆదరించింది. అలా శైవులుగా మారిన వారిని జంగాలు అన్నారు.

హరిదాసుడైన ఓ దాసరి శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు బయలుదేరి, అలిపిరికి చేరుకున్నాడు. తొలి మెట్టు ఎక్కబోతూ తిరు వేంకటనాథుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ మాల కులానికి చెందిన ఆ దాసరి శిలగా మారిపోయాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఆ శిల్పాన్ని ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. దీని వెనుక అసలు రహస్యం ఏంటంటే... సకల చరాచర సృష్టికి మూలమైన శ్రీమన్నారాయణుడి మహిమలు సామాన్యం కాదు.... స్వామివారిని పూజించే సమయంలో నేను.. నాది అని అడగడం కన్నా దేవుడా అంతా నువ్వే అన్న భావనతో ఉంటే ఖచ్చితంగా మనసులో కోర్కెలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.