యాప్నగరం

వీడియో: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 17 Jul 2018, 5:09 pm
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కల్యాణోత్సవంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దంపతులు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా బల్కంపేట వీధుల్లో భక్తులు పోటెత్తారు. పెద్దసంఖ్యలో శివసత్తులు, ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా కల్యాణానికి హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరనందున ఆలయ నిర్వహకులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం


మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు అమ్మవారి కల్యాణ మహోత్సవం జరిగింది. అంతకు ముందు సోమవారం ఉదయం 5.30 గంటలకు గణపతి పూజతో ఈ వేడుకలు మొదలయ్యాయి. అనంతరం రాత్రి 7 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఎదురుకోళ్లు నిర్వహించారు.

చివరిరోజు బుధవారం ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం 6 గంటలకు పుర వీధుల్లో ఎల్లమ్మ తల్లిని ఊరేగిస్తారు. రథోత్సవం దేవాలయం నుంచి ప్రారంభమై తిరిగి ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.