యాప్నగరం

ఈయన కర్ణుడి కొడుకు కానీ అర్జునుడి సంరక్షణలో...

మహాభారతంలో కర్ణుడిని మించిన వీరుడు లేకపోయినా, తనకు తెలియకుండా జరిగిన తప్పుల వల్ల నేర్చుకున్న విద్య కీలక సమయాల్లో అక్కరకు రాకుండా పోయింది.

TNN 4 Dec 2022, 11:32 pm
పురాణాల ప్రకారం కర్ణుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు వృశాలి. ఈమె రథసారధి కూతురు. రెండో భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుడి భార్య భానుమతి స్నేహితురాలు. కర్ణుడికి తొమ్మిది మంది సంతానం. వీరిలో ఎనిమిది మొదటి భార్య వృశాలికి జన్మించారు. ఈ ఎనిమిది మంది కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. వీరిలో పెద్దవాడైన వృషసేనుడి తన తండ్రి కర్ణుడి రథం ముందు ఉన్న సమయంలో అర్జునుడు సంహరించి పద్మవ్యూహంలో అభిమన్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
Samayam Telugu maha bharat


మరో ఇద్దరు కుమారులు శత్రుంజయ, ద్విపాతలు కూడా పార్థుడి చేతిలో మరణించారు. మిగతా వారిని సాత్యకి, భీముడు, నకులుడు సంహరించారు. వృషకేతుడు మాత్రమే యుద్ధం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈయన తల్లి వృశాలి లేదా సుప్రియ కావచ్చు. కర్ణుడు మరణించేనాటికి ఈయన చాలా చిన్నవాడు. రాధేయుడి మరణం తర్వాత వృషకేతుడి బాధ్యతలను అర్జునుడు తీసుకున్నాడు. కృష్ణార్జునులు ఇద్దరూ ఈయనను అమితంగా ఇష్టపడేవాళ్లు.

అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్ర, వారుణాస్త్ర, అగ్ని, వాయాస్త్రాలను వినియోగించడం తెలిసిన వ్యక్తి కూడా. ఈ నాలుగు అస్త్రాలను వాడితే భూమిపై జీవరాశి మిగలదు. ఇది తెలిసిన కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవరికీ బోధించవద్దని వృషకేతుడికి సూచించాడు. అర్జునుడి నిర్వహించి అనేక అశ్వమేధ యాగాల్లో వివిధ రాజ్యాలతో యుద్ధం కూడా చేశాడు. అయితే చివరకు అర్జునుడి కుమారుడు బబ్రువాహునుడే వృషకేతుని సంహరించాడు. దైవికమైన ఆయుధాల పరిజ్ఞానం తెలిసిన వ్యక్తి కావడం వల్లే అతడు మరణించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.