యాప్నగరం

వనవాసంలో ఉన్న ద్రౌపదిని ఎత్తుకెళ్లి....

కౌరవులు 100 మంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరికి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు దుశ్శల. ధ్రుతరాష్ట్రుడు, గాంధారికి పుట్టిన ఏకైక పుత్రిక.

TNN 24 Mar 2017, 2:51 pm
కౌరవులు 100 మంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ వీరికి ఓ సోదరి కూడా ఉంది. ఆమె పేరు దుశ్శల. ధ్రుతరాష్ట్రుడు, గాంధారికి పుట్టిన ఏకైక పుత్రిక. దుశ్శల అంటే పాండవులకు కూడా ఎంతో ప్రేమ. కురుపాండవులతో అనురాగాలతో ఆమె బాల్యం అద్భుతంగా సాగినా, వివాహం తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సింధూ రాజు జయద్రతుడితో దుశ్శలకు వివాహం అయ్యింది.
Samayam Telugu kauravas only sister dushala lived a terrible sad life
వనవాసంలో ఉన్న ద్రౌపదిని ఎత్తుకెళ్లి....


సింధు ప్రాంతానికి శక్తివంతమైన రాజుగా ఉన్న జయద్రతుడు చంచలమైన గుణం కలవాడు. అంతే కాదు మహిళలంటే గౌరవం లేని వ్యక్తి. శివుడి అనుగ్రహం ఉందనే దురహాంకారంతో విర్రవీగేవాడు. దుశ్శలను ఎన్నో చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమె పట్ల ఎంతో అమానుషంగా ప్రవర్తించాడు. ఒకానొక సందర్భంలో అడవిలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని అపహరించి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు.

ద్రౌపది అపహరణకు గురైన విషయం తెలుసుకున్న ధర్మరాజు తన సోదరులైన భీమార్జునులను వెదకడానికి పంపించాడు. పాంచాలిని బంధించి తీసుకుపోతున్నజయద్రతుడిని ఇరువురూ వెంబడించి పట్టుకున్నారు. అతడిని చంపడానికి భీముడు ప్రయత్నిస్తే ద్రౌపది అడ్డుకుంది. ఇతడిని చంపితే మీ సోదరి విధవరాలిగా మారుతుంది కాబట్టి జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకునేలా శిక్ష ఉండాలని చెబుతుంది. దీంతో భీముడు అతడికి శిరోముండనం చేసి పంపుతాడు.

ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక పాండవులపై పగ పెంచుకుంటాడు. ఎలాగైనా పాండవులు ఓడించాలనే సంకల్పంతో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు వరం ప్రసాదించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఈ శక్తితో పాండవులను, వారి సేనలను పూర్తిగా ఓ రోజు నిలువరించగలవని తెలిపాడు. అయితే పార్థుని ఎదుట మాత్రం నీ శక్తులు పనిచేయవని హెచ్చరించాడు. మహాదేవుడు హెచ్చరించినా వరగర్వంతో అర్జునుడికి ఎదురెళ్లాడు. దీంతో చివరికి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జయద్రతుడిని హతమార్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.