యాప్నగరం

ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలి పూజ

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గణేశ్ మండపాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. వినాయకుడి ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి

TNN 25 Aug 2017, 11:33 am
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గణేశ్ మండపాల వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. వినాయకుడి ఆలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు తొలి పూజ చేశారు. గవర్నర్ దంపతులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. అనంతరం గవర్నర్ దంపతులు పార్వతీ పుత్రుడికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏకదంతుడిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఖైరతాబాద్‌లో ఈ ఏడాది 57 అడుగుల మహాగణపతి శ్రీ చండీకుమార అనంత మహాగణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నాడు.
Samayam Telugu khairatabad maha ganapati governor narasimhan with his wife offers puja
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలి పూజ


ఖైరతాబాద్ గణేశుడికి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ గణపతిని దర్శించుకోడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణపయ్య ఎత్తు మూడేళ్ల నుంచి ఒక్కో అడుగు తగ్గుతూ వస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సికింద్రాబాద్‌లోని వినాయకుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక వాడవాడలా ఏర్పాటు చేసిన గణేశుడి మండపాల్లో కొలువు దీరేందుకు వివిధ రూపాల్లో పార్వతీ తనయుడు సిద్ధమయ్యాడు. ముంబయి, పుణేల్లోనూ వినాయక చవితి సంబరాలు కోలహలంగా ప్రారంభమయ్యాయి. ముంబై సిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.