యాప్నగరం

నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Samayam Telugu 11 Sep 2018, 1:04 am
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. మంగళవారం వేకువజామున 3 గంటలకు స్వామివారి సుప్రభాత సేవ తర్వాత తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు తిరుమంజనం జరుగుతుంది. తిరుమంజనంలో భాగంగా.. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రిని శుద్ధి చేస్తారు.
Samayam Telugu Tirumala


శుద్ధి తర్వాత నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకమ వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి ఆలయంలో పూస్తారు. ఆలయ శుద్ధి పూర్తి చేశాక ఉదయం 11 గంటల నుంచి భక్తుల్ని అనుమతించనున్నారు. తిరుమంజనం కావడంతో శ్రీవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. మిగిలిన సేవల్ని మాత్రం జరుగుతాయి. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాల పర్వదినాల ముందు మంగళవారం నాడు ఆలయశుద్ధి చేయడం ఆనవాయితీగా వస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.