యాప్నగరం

హేళన చేసినవారికి బుద్ధుడు చెప్పిన గుణపాఠం

ప్రాపంచిక సుఖాలను త్వజించి ఆత్మఙ్ఞానం కోసం బయలుదేరి సిద్ధార్థుడు బుద్ధుడిగా మారి బౌద్ధ ధర్మాన్ని బోధించాడు. అహింస, శాంతి మార్గాల ద్వారా సాధించలేనిది ఏదీ లేదన్నాడు.

TNN 13 Jun 2017, 5:04 pm
ఒక రోజు బుద్ధ భగవానుడు బిక్షాటన చేస్తూ ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. రుసరుసాలుడుతూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇల్లాలు ఎదురుగా నిలబడి ఉన్న బుద్ధుడిని చూసి దుక్కలా ఉన్నావు, ఇలా అడుక్కోకపోతే ఏదైనా పనీ పాటా చేసుకుని బతకొచ్చుగా...నీవు సోమరిగా తయారవడమే కాకుండా నీ శిష్యులని చెప్పుకుంటున్న వీరిని కూడా సోమరులుగా తయారుచేస్తున్నావని నోటికొచ్చినట్లు తిట్టింది. భగవానుడు చిరునవ్వుతో ఆమె పౌరుషమైన మాటలను విన్నాడు కానీ ఏమీ అనలేదు. అయితే మరోవైపు పట్టరాని కోపంతో ఊగిపోతున్న శిష్యులను చూసి వారించాడు.
Samayam Telugu life changing lesson teaches by lord buddha
హేళన చేసినవారికి బుద్ధుడు చెప్పిన గుణపాఠం


తర్వాత ప్రసన్నవదనంతో మాతా! చిన్న సంశయం, తీరుస్తారా ? అన్నాడు. అందుకు ఆమె అడుక్కోవడం నీకు అలవాటే కదా, నీ సంశయం తీరుస్తాలే అంది. బుద్ధుడు తన చేతిలోని బిక్షాపాత్రను చూపుతూ తల్లీ! నేను నీకు ఓ వస్తువును ఇచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఎవరికి చెందుతుంది? అని ప్రశ్నించాడు. అందుకు ఆమె నేను తీసుకోకుండా తిరస్కరించాను కాబట్టి ఆ వస్తువు నీకే చెందుతుందని వేళాకోళంగా బదులిచ్చింది.

అయితే... తల్లీ! నేను నీ తిట్లను స్వీకరించడం లేదనేసరికి ఆమె తన తప్పును తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది. ఈ సంఘటనతో బుద్ధుడు గొప్ప ధర్మాన్ని బోధించాడు. మనల్ని అవమానించే వాళ్లు, వేళాకోళం చేసేవాళ్లు చుట్టూ చాలా మంది ఉంటారు. కొందరు బహిరంగంగా విమర్శిస్తే, ఇంకొందరు చాటుగా విమర్శిస్తుంటారు. వాటిని మనం పట్టించుకోనంత వరకు మన దారిలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.ఎప్పుడైతే వాటిని పట్టించుకుంటావో ఆ క్షణమే నీ పతనానికి పునాది వేసుకున్నట్లే.పదిమంది నీపై విమర్శలు చేస్తున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్టే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.